Asianet News TeluguAsianet News Telugu

‘ఆదిపురుష్’ డైరెక్టర్ కు గిఫ్ట్ గా రూ.4 కోట్ల లగ్జరీ కారు.. ఈ సమయంలో ఎవరిచ్చారు? ఎందుకు?

‘ఆదిపురుష్’ డైరెక్టర్, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) తాజాగా రూ.4 కోట్లకు పైగా విలువ చేసే ఫెరారీ కారును బహుమతిగా పొందారు. ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

Who gave Rs 4 crore luxury car as a gift to the director of Adipurush? why?
Author
First Published Oct 19, 2022, 3:22 PM IST

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ (Om Raut), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో బిగ్ ప్రొడక్షన్ కంపెనీ ‘టీ సిరీస్’ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్ర యూనిట్ తోపాటు మేకర్స్ ‘ఆదిపురుష్’ను గ్రాండ్ గా రిలీజ్  చేసేందుకు సంబంధిత ఏర్పాట్లను చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు ఓం రౌత్ కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. 

రూ.4.02 కోట్ల ఖరీదైన లేటెస్ట్ ఫెరారీ F8 కారును బహుమతిగా పొందారు. ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ లగ్జరీ కారును టీ సీరిస్ అధినేత, ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకనే వివరాలను తెలియాల్సింది. అయితే తమ బ్యానర్లలో దర్శకత్వం వహించిన డైరెక్టర్లకు కార్లను గిఫ్ట్ గా ఇస్తుంటారు నిర్మాత భూషణ్ కుమార్.  చివరిగా ‘భూల్ భులయ్య’ చిత్ర దర్శకుడికి కూడా కారు గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ క్రమంలో ఆదిపురుష్ దర్శకుడికి కూడా బహుమతిగా ఫెరారీని అందించినట్టు తెలుస్తోంది. 

మరోవైపు ‘ఆదిపురుష్’ ఇంకా రిలీజ్  కాలేదని, అలాంటప్పుడు చిత్ర దర్శకుడికి కారు గిఫ్ట్ గా ఎలా ఇస్తారని అంటున్నారు. దీనిపై మరికొందరు స్పందిస్తూ వాస్తవం ఏమిటంటే ఫెరారీని భూషణ్ కుమార్ దర్శకుడికి బహుమతిగా ఇవ్వలేదని అంటున్నారు. ఆ కారు తన స్వంత రైడ్ కోసం తీసుకొచ్చిందని.. మీడియా కోసం కారువద్ద స్టిల్స్ ఇచ్చారని అంటున్నారు. ఈలోగా కారును బహుమతిగా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో న్యూస్ స్పెడ్ అవుతుందని కూడా తెలుస్తోంది. 

ఇక 'ఆదిపురుష్'  హిందూ పౌరాణిక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాల్మీకి 'రామాయణం' ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో రూ.500 కోట్ల తో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. 2023లో జనవరి  12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతంది. క్రితి సనన్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios