Akhanda: హిందీ రీమేక్ కు అదే పెద్ద సమస్య అయ్యి కూర్చుంది

 టాక్ పరంగా, వసూళ్ల పరంగా అఖండ దూసుకుపోతుంది. రోజులు గడుతున్నా.. అన్ స్టాపబుల్ అంటూ థియేటర్ల దుమ్ము దులుపుతుంది ఈ సినిమా. ఇక బాలయ్య నట విశ్వరూపం చూపించారు. 

Which hero in Akhanda Hindi remake?

కరోనా రెండు వేవ్స్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు థియేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర జాతర మొదలవ్వటానికి  కారణం ‘అఖండ’(Akhanda). బాలకృష్ణ(Balakrishna), బోయపాటి కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బస్టర్ అయ్యింది. రిలీజై పది రోజులు దాటుతున్నా  కలెక్షన్ల ప్రవాహానికి అడ్డూ అదుపూ లేదు. వంద కోట్ల గ్రాస్ ని అందుకుని బ్లాక్ బస్టర్ కి మించి దూసుకుపోతున్న Akhandaను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఇక్కడే ఓ పెద్ద సమస్య కనపడుతోందని వినికిడి.

బాలకృష్ణ స్దాయిలో హిందీ తెరపై రౌద్రంగా ఎమోషన్స్ ఆ స్దాయిలో పండించేదెవరు అనేది పెద్ద ప్రశ్నగా మారింది.  అఖండ పూర్తిగా బాలయ్య వన్ మ్యాన్ షో. బాలయ్య పెర్ఫార్మన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కథలో చాలా లోపాలను కప్పిపెట్టేసి ఆడియన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. కథా పరంగా క్యారెక్టరైజేషన్ల పరంగా సమస్యలు ఆ ఊపులో కనిపించకుండా పోయాయి.  ఇంటర్వెల్ బ్లాక్ లో Balayya స్థానంలో వేరే హీరోల్లో ఎవరినీ ఊహించుకోలేని సిట్యువేషన్ నెలకొంది. దాంతో హిందీకు ఎవరు ఆ పాత్ర వేయటానికి ఫెరఫెక్ట్ గా సెట్ అవుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

హిందీలో అజయ్ దేవగన్ కానీ అక్షయ్ కుమార్ కానీ చేస్తారని అక్కడ మీడియా అంటోంది. అజయ్, అక్షయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా వీరిద్దరూ పరకాయ ప్రవేశం చేయగలరు. కానీ వాళ్లిద్దరూ బాలయ్య స్దాయిలో ఎమోషన్స్ రైజ్ చేయగలరా. ‘అఖండ’గా మెప్పించగలరనే నమ్మకం వారిలో ఉందా అంటున్నారు. సంజయ్ దత్ అయితే సరిపోయేవాడు కానీ ఆయనకు ఇప్పుడు అసలు మార్కెట్ లేదు. ఇక ఈ ఇద్దరు హీరోలు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి చివరికి ఎవరు ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతారో.. వీరిద్దరూ కాకుండా ఇంకెవరైనా తెరమీదికి వస్తారో.

ఎవరు హిందీలో చేసినా చాలా మార్పులు అవసరమవుతాయి. సరిగ్గా బాలన్స్ చేసుకోగలిగితే అఖండ రీమేక్ తో హిట్టు కొట్టొచ్చు. లేకపోతే ఇక్కడ జేజేలు అందుకున్న సినిమా అక్కడ నవ్వులపాలవుతుందనేది నిజం. అందుకే  రీమేక్ రైట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకునేందుకు భారీ  నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నా ఆలోచనలో పడుతున్నాయట. హీరో సెట్ అయ్యితే.. డీల్ సెట్ అయినట్టేనని సమాచారం.  మరో ప్రక్క ఈ చిత్రం రైట్స్ అధికారికంగా ఎవరు కొన్నది ఇంకా బయటికి రాలేదు కానీ బడా ప్రొడక్షన్ చేతికే రైట్స్ వెళ్లాయని తెలిసింది. 

also read: Akhanda:ఓవర్సీస్‌ లో ఇంకో రికార్డ్ ,బాలయ్య కెరీర్ లో సెకండ్ టైమ్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios