Rajamouli : రాజమౌళి,మహేష్ షూట్ ఎప్పుడు ప్రారంభమంటే..
.రాజమౌళి ఆయన కుటుంబం కలిసి ఏప్రియల్ నుంచి 15 రోజులు పాటు యూరోప్ వెకేషన్ కు వెళ్తున్నారు. థియోటర్ రన్ పూర్తయ్యేసరికి ఇండియా వస్తారు. ఆ తర్వాత రాజమౌళి పూర్తిగా మహేష్ బాబు సినిమాపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం స్టోరీ లైన్ లాక్ చేసేసారని చెప్పారు. స్క్రిప్టు వర్క్ జరుగుతోంది.
రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్ , సముద్ర ఖని , అజయ్ దేవగన్ ఇతర పాత్రల్లో నటించిన RRR మూవీ నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలైంది. చరిత్రను టచ్ చేస్తూ .. కాల్పనికతను జోడిస్తూ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా మార్నింగ్ షో తోనే హిట్ టాక్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ - చరణ్ పాత్రలను ఆయన మలిచిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా చూసిన ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు ఈ సినిమా టీమ్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. మరో ప్రక్క కొంత నెగిటివ్ టాక్ రన్ అవుతోంది. అయితే అంత అనుకున్నట్లే ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా గత చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేసింది. భారీ అంచనాల మధ్య ..పెద్ద ఎత్తున థియేటర్స్ లలో విడుదల కావడం తో ఫస్ట్ డే కలెక్షన్లు దుమ్ములేపాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ ధరలు భారీగా పెంచడం తో కలెక్షన్లు కుమ్మేసాయి. ఈ నేపధ్యంలో రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుందనే టాక్ హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం మేరకు ...రాజమౌళి ఆయన కుటుంబం కలిసి ఏప్రియల్ నుంచి 15 రోజులు పాటు యూరోప్ వెకేషన్ కు వెళ్తున్నారు. థియోటర్ రన్ పూర్తయ్యేసరికి ఇండియా వస్తారు. ఆ తర్వాత రాజమౌళి పూర్తిగా మహేష్ బాబు సినిమాపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం స్టోరీ లైన్ లాక్ చేసేసారని చెప్పారు. స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. దసరా 2022 నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం మల్టిస్టారర్ కాదన ఇప్పటికే రాజమౌళి క్లియర్ చేసేసారు.అలాగే ఆర్.ఆర్.ఆర్ కన్నా చాలా పెద్దది అన్నారు.
ఇక ఈ సినిమా జానర్ ఏంటనే విషయమై చాలా స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. ఎడ్వెంచర్ ఫిల్మ్ అని ఆఫ్రికా అడవుల్లో కొంత కథ జరుగుతుందని చెప్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎల్ నారాయణ ఈ మెగా ప్రాజెక్టుని నిర్మించనున్ారు. మరో ప్రక్క మహేష్ తాను కమిటైన త్రివిక్రమ్ ఫిల్మ్ పూర్తి చేసుకుని ఈ ప్రాజెక్టులోకి రావాలనుకుంటున్నారు. మేలో త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అవుతుంది.
ఇక ఆర్.ఆర్ ఆర్ విషయానికి వస్తే... బాహుబలి 2' తర్వాత ఫస్ట్ డే 200 కోట్లు వసూలు చేసిన ఏకైక సినిమాగా 'ఆర్.ఆర్.ఆర్' నిలిచింది. ఈ రెండు సినిమాలు కూడా జక్కన్న తెరకెక్కించిన సినిమాలే కావడం విశేషం. ఇక యూఎస్ఏలో ప్రీమియర్స్ తో $ 3 మిలియన్ అందుకున్న మొదటి భారతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది.
యూఎస్ లో ప్రీమియర్స్ మరియు ఓపెనింగ్ డే కలుపుకొని RRR కలెక్షన్స్ 5 మిలియన్ల డాలర్ల మార్కును క్రాస్ చేసింది. అమెరికాలో ఏ భారతీయ సినిమాకైనా ఇదే ఆల్ టైమ్ రికార్డ్. ఇంతకముందు 'బాహుబలి 2' అక్కడ 4.59 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియాలో 4.03 కోట్లు రాబట్టి 'బ్యాట్ మ్యాన్' ను ఓవర్ టేక్ చేసింది.