పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని టాలీవుడ్ లో చాలా మంది దర్శకనిర్మాతలు ఆశ పడుతుంటారు. ఈ మేరకు ఆయనకి అడ్వాన్స్ లు ఇవ్వాలని తిరిగిన నిర్మాతలెందరో.. కానీ ఆయన మాత్రం 'అజ్ఞాతవాసి' సినిమా తరువాత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.

అయితే అంతకముందే టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ వారు పవన్ తో సినిమా చేయాలని ఆయనకి కొంత డబ్బుని అడ్వాన్స్ గా ఇచ్చారు. కానీ పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన సినిమా చేయరేమోనని అనుకున్నారు.

ఈ క్రమంలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఎప్పటికైనా మా బ్యానర్ లో పవన్ సినిమా ఉంటుందని నమ్మకంగా చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ తో ఆయన మళ్లీ సినిమాలు చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. సినిమాలు చేసే సమయం లేదు.. ఇక పూర్తి సమయం ప్రజల సేవకే అంకితమని పవన్ అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పట్లో సినిమా చేస్తారని ఆశించే వారందరికీ ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

మరి ఇప్పుడు పవన్ సినిమాలు చేయరని క్లారిటీ వచ్చేసింది కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ వారు తమ అడ్వాన్స్ ని తిరిగి తీసుకుంటారా లేదా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారికైతే డబ్బు అడిగి తీసుకునే ఆలోచన లేదట. మరి పవన్ తిరిగిస్తాడో లేదో చూడాలి!

తన పొలిటికల్ ఫిల్మ్ పై పవన్ క్లారిటీ!

పొలిటికల్ చిత్రంలో పవన్, డైరక్టర్ ఎవరంటే..?

బ్రేకింగ్ అప్డేట్: పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ పవర్ఫుల్ మూవీ?