Asianet News TeluguAsianet News Telugu

‘కేజిఎఫ్ 2’ రిలీజ్ కు దారేది ?ఇలా ఇరుక్కుపోయిందేంటి

 ‘కేజీఎఫ్ 2’ది ఇప్పుడు అదే పరిస్దితి. కరోనా దెబ్బతో ప్లాన్ చేసుకున్న రిలీజ్ డేట్ కు రిలీజ్ అవటం కష్టమే అని తేలిపోయింది. ఫస్ట్ కాపీతో సినిమా రిలీజ్ కు రెడీ ఉన్నా..ఏం చేయాలో తెలియని సిట్యువేషన్ లో కు వెళ్లింది.

when will Kgf 2 movie Release? jsp
Author
Hyderabad, First Published May 1, 2021, 4:49 PM IST

పెద్ద సినిమాలకు రిలీజ్ డేట్ ఎంత ముఖ్యమో తెలియంది కాదు. ఆచి,తూచి రిలీజ్ డేట్ లు ఫిక్స్ చేసుకుంటూంటారు. సీజన్, అన్ సీజన్ చూసుకోవాలి. ప్రక్కన ఏ సినిమాలు రిలీజ్ పెట్టుకున్నాయో గమనించుకోవాలి. తమ సినిమాకు ఏ సినిమా పోటీ కాకుండా ప్లాన్ చేసుకోవాలి. ఇన్ని చేసాక...ఫిక్స్ చేసుకున్న డేట్ కు రిలీజ్ చేయగలగాలి. అయితే ఒక్కోసారి అది చాలా టఫ్ టాస్క్ గా మారిపోతుంది.  ‘కేజీఎఫ్ 2’ది ఇప్పుడు అదే పరిస్దితి. కరోనా దెబ్బతో ప్లాన్ చేసుకున్న రిలీజ్ డేట్ కు రిలీజ్ అవటం కష్టమే అని తేలిపోయింది. ఫస్ట్ కాపీతో సినిమా రిలీజ్ కు రెడీ ఉన్నా..ఏం చేయాలో తెలియని సిట్యువేషన్ లో కు వెళ్లింది. 

కన్నడ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘కేజిఎఫ్’. ఈ సినిమా రెండేళ్ల క్రితం విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ను తెరకెక్కించారు.  ఈ సినిమా షూటింగ్  బెంగుళూరు మైసూర్, రామోజీ ఫిల్మ్ సిటీ, బళ్లారి ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. పలువురు బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ కి, ఇప్పుడు సమ్మర్ లాంటి మరో సీజన్ కనిపించడం లేదు. 

ఈ సినిమాకి భారీ పెట్టుబఢి పెట్టి...భారీగా అమ్మారు. కరోనా సెకెండ్ వేవ్ కి ముందే కేజిఎఫ్ 2 సినిమా కోసం ఎన్నడూ లేనిది తెలుగులో కూడా గట్టిగా పోటీ పడ్డాయి పలు సంస్థలు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పైగా కేజిఎప్ 2కి మరో మంచి రిలీజ్ డేట్ దొరికేలా లేదు. చూస్తూంటే సోలో రిలీజ్ డేట్ అసాధ్యం అనిపిస్తోంది.  ఈ సినిమాతో కన్నడ సినిమాల మార్కెట్  ను ఒక్కసారిగా ఆకాశాన్ని అందుకుంది.. కన్నడ ఇండస్ట్రీ టెక్నికల్ గా  ఉన్నత స్థాయిలో ఉండదన్న అపవాద చెరిపేసింది.కేజీఎఫ్ ను  అత్యుత్తమ నిర్మాణ విలువలతో కూడిన సినిమా ను భారత సినీ ప్రేమికులకు శాండిల్ వుడ్ నిర్మాతలు అందించారు. ఈ సినిమాతో యశ్ హీరో,  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో రాఖీ బాయ్  పోషించిన పాత్ర ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడిని అలరించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios