సౌందర్య, రంభ హీరోయిన్స్ గా చేస్తన్న మూవీలో హీరో ఛాన్స్ అనగానే సంతోషపడ్డాను. అయితే ఆ ప్రాజెక్ట్ నుండి నన్ను చివరి నిమిషంలో తప్పించారని తెలిసి బాధపడ్డాను, అన్నారు నటుడు శ్రీకాంత్. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఆ విషయం ఏమిటో చూద్దాం.. 

సెట్స్ పైకి వెళ్ళే వరకు కాంబినేషన్స్ ని నమ్మలేం. కొన్ని కాంబినేషన్స్ షూటింగ్ మధ్యలో కూడా మారిపోతూ ఉంటాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ నుండి హీరోయిన్స్... అవసరమైతే హీరోలను కూడా మార్చేస్తూ ఉంటారు. ప్రతి హీరో, హీరోయిన్ కెరీర్ లో ఇలాంటి అనుభవాలు ఉంటాయి. నటుడు శ్రీకాంత్ కి సైతం ఇలాంటి అనుభవం ఎదురైందట. రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన వేటగాడు చిత్రానికి మొదట హీరోగా శ్రీకాంత్ ని అనుకున్నారట. ఏమైందో తెలియదు కానీ... ఆయన్ని తప్పించి, రాజశేఖర్ ని తీసుకున్నారట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో శ్రీకాంత్ గుర్తు చేసుకున్నారు. 

ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆమె, తాజ్‌మహాల్‌ చిత్రాలు నా కెరీర్‌కు చాలా ప్లస్‌ అయ్యాయి. పెళ్లి సందడి తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఒకనొక దశలో ఏడాదిలో 13 సినిమాల్లో నటించాను. పగలు ఒక సినిమా, రాత్రి ఒక సినిమా షూటింగ్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి’అని శ్రీకాంత్‌ చెపుకొచ్చారు. అలాగే రాజశేఖర్‌ హీరోగా నటించిన వేటగాడు సినిమాలో తొలుత తననే హీరోగా తీసుకున్నారని, కానీ కొన్ని కారణాల వల్ల పక్కకు తప్పించారని చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో సౌందర్య, రంభ హీరోయిన్లు అని తెలియడంతో చాలా సంతోషపడ్డానని, కానీ చివరి క్షణంలో తీసేయడంతో అంతకు ఎక్కువగా బాధపడ్డానని చెప్పాడు. అయితే హీరోగా తొలగించినప్పటికీ.. ఆ సినిమాలో ఓ చిన్న పాత్రను చేశానని శ్రీకాంత్‌ చెప్పుకొచ్చాడు.

1993లో విడుదలైన వేటగాడు హిందీ హిట్ మూవీ బాజీగర్ రీమేక్. షారుక్ హీరోగా నటించిన చిత్రాన్ని తెలుగులో వేటగాడు టైటిల్ తో తెరకెక్కించారు. అయితే తెలుగులో ఈ మూవీ అట్టర్ ప్లాప్ కావడం విశేషం. దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ తెరకెక్కించారు. రాజశేఖర్ కెరీర్ లో చెత్త సినిమాల్లో వేటగాడు ఒకటిగా నిలిచిపోయింది. 

ఇక ప్రస్తుతం శ్రీకాంత్ విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. బాలకృష్ణ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ మూవీలో ఆయన విలన్ రోల్ చేశారు. వరదరాజులు క్యారెక్టర్ లో నట విశ్వరూపం చూపించారు. శ్రీకాంత్ కెరీర్ విలన్ గానే ప్రారంభం కావడం విశేషం. పరిశ్రమకు వచ్చిన కొత్తలో శ్రీకాంత్ విలన్ పాత్రలు చేశారు.