Asianet News TeluguAsianet News Telugu

ప్రియాంకతో తిరిగితే విడాకులు ఇస్తా, షారుక్ ఖాన్ కి భార్య వార్నింగ్!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సైతం పెళ్ళై పిల్లలు పుట్టాక హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రేమలో పడ్డాడట. అయితే షారుక్-ప్రియాంకల ప్రేమ కథకు ఆయన భార్య గౌరీ ఖాన్ చెక్ పెట్టిందట. 
 

when shahrukh wife gauri khan warns him not to talk with priyanka chopra ksr
Author
Hyderabad, First Published May 31, 2021, 8:26 AM IST


ప్రేమ అనేది ఏ క్షణంలో ఎవరిపై ఏ వయసులో కలుగుతుందో చెప్పడం కష్టమే. పెళ్ళైన వాళ్ళు బ్యాచ్ లర్స్ ప్రేమలో పడ్డ సందర్భాలు ఉన్నాయి. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సైతం పెళ్ళై పిల్లలు పుట్టాక హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రేమలో పడ్డాడట. అయితే షారుక్-ప్రియాంకల ప్రేమ కథకు ఆయన భార్య గౌరీ ఖాన్ చెక్ పెట్టిందట. 


షారుక్, ప్రియాంక కలిసి సూపర్ హిట్ డాన్ సిరీస్ లో నటించారు. డాన్ సినిమా కంటే ముందే సెలబ్రిటీ పార్టీల ద్వారా ప్రియాంకా షారుక్ మధ్య పరిచయం ఏర్పడిందట. ప్రియాంక అందం, మాట తీరు షారుక్ మనసుకు బాగా నచ్చేశాయట. సూపర్ స్టార్ గా బాలీవుడ్ ని ఏలుతున్న షారుక్ తను హాజరయ్యే ప్రతి పార్టీకి ప్రియాంకను కూడా పిలవాలని ఒత్తిడి చేసేవారట. షారుక్ మాట కాదనలేక ప్రియాంకను కూడా పిలిచేవారట. 


అలాగే తాను నటించే కమర్షియల్ యాడ్స్ లో హీరోయిన్ నటించాల్సి ఉంటే ప్రియాంకను తీసుకోవాలని కూడా షారుక్ ఒత్తిడి చేసేవారట. ఇక షూటింగ్ సెట్స్ లో అర్థ రాత్రుల వరకు మాట్లాడుకుంటూ యూనిట్ కంటపడేవారట. ఇలా ప్రియాంకతో షారుక్ ప్రేమ ముదిరి పాకాన పడడంతో పాటు భార్య గౌరీ ఖాన్ వరకు చేరిందట. 


ఇకపై ప్రియాంక చోప్రాతో నటించినా, కలిసి తిరిగినా విడాకులు ఇచ్చేస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చారట గౌరీ ఖాన్. ఫ్యామిలీ కోసం షారుక్ ప్రియాంక చోప్రాకు బ్రేకప్ చెప్పక తప్పలేదట. అలా ప్రియాంకతో షారుక్ ప్రేమ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టిందట. షారుక్ నుండి విడిపోవడం ప్రియాంకను సైతం తీవ్రంగా బాధించింది అని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios