Asianet News TeluguAsianet News Telugu

సాయి పల్లవితో దేవుడు నేరుగా మాట్లాడతాడా? షాకింగ్ మేటర్ వెలుగులోకి!

హీరోయిన్ సాయి పల్లవి దేవుడితో మాట్లాడుతుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఆమె కోరుకుంటే చాలు తనతో దేవుడు మాట్లాడతాడట. 
 

when heroine sai pallavi said god used to speak with me ksr
Author
First Published Oct 1, 2024, 11:37 AM IST | Last Updated Oct 1, 2024, 11:53 AM IST

తమిళ అమ్మాయి సాయి పల్లవికి తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె నటించిన ఫిదా, ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ మంచి విజయాలు సాధించాయి. సాయి పల్లవి మిగతా హీరోయిన్స్ కి భిన్నంగా ఉంటారు. ఆమె కొన్ని విలువలు పాటిస్తుంది. డబ్బుల కోసం సినిమాలు చేసే టైప్ కాదు. 

ఆ మధ్య కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్న సాయి పల్లవి వరుస చిత్రాలు చేస్తుంది. కాగా గతంలో సాయి పల్లవి తాను దేవుడితో మాట్లాడతానన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ, ఇది నిజం అట. 

చిరంజీవికే ఝలక్ 

సాయి పల్లవి సినిమాల ఎంపిక విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. పాత్ర నచ్చితేనే మూవీ ఒప్పుకుంటారు. స్టార్ హీరో సినిమా అని నేను గుడ్డిగా సైన్ చేయను. చిన్న హీరో అయినా కూడా స్క్రిప్ట్ నచ్చితే సినిమా చేస్తానని గతంలో సాయి పల్లవి అన్నారు. కాగా సాయి పల్లవి చిరంజీవి సినిమానే రిజెక్ట్ చేయడం అప్పట్లో చర్చకు దారి తీసింది. 

ఈ విషయాన్ని ఓ వేదికపై స్వయంగా సాయి పల్లవి ముందే చిరంజీవి చెప్పాడు. భోళా శంకర్ మూవీలో చిరంజీవి చెల్లెలు పాత్రకు సాయి పల్లవిని సంప్రదించగా చేయను అన్నారట. దాంతో ఆ పాత్రకు కీర్తి సురేష్ ని తీసుకున్నారు. భోళా శంకర్ తమిళ్ హిట్ మూవీ వేదాళం కి రీమేక్. తెలుగులో డిజాస్టర్ అయ్యింది. 

భోళా శంకర్ ని రిజెక్ట్ చేయడానికి కారణం ఏమిటో సాయి పల్లవి వెల్లడించారు. నేను రీమేక్ చిత్రాల పట్ల ఆసక్తి చూపను. ఆల్రెడీ ఒకరు చేసిన పాత్ర మనం చేస్తే పోలికలు వస్తాయి. అందుకే భోళా శంకర్ చేయలేదని సాయి పల్లవి, అన్నారు. 

when heroine sai pallavi said god used to speak with me ksr

దేవుడితో మాట్లాడుతున్న సాయి పల్లవి

సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో తనతో దేవుడు మాట్లాడతాడని చెప్పడం సంచలనం రేపింది. ఆమె మాట్లాడుతూ... నేను ఏ సెట్లో అయితే ఓడిపోయానో... అదే సెట్ లో ప్రభుదేవా సర్, రౌడీ బేబీ సాంగ్ కంపోజ్ చేశారు. అప్పుడు నాకు అనిపించింది...  దేవుడు మన కోసం కొన్ని ప్లాన్ చేస్తాడు. కోల్పోయిన దాని కంటే ఎక్కువ కలిపి ఇస్తాడు, అన్నారు. 

ఆమె ఇంకా మాట్లాడుతూ.. దేవుడు నాతో మాట్లాడతాడు. నేను మౌనంగా కూర్చుని మనసులో ప్రశ్నలు అడిగితే ఆయన సమాధానం చెబుతాడు. మనం చేసే పని విషయంలో సూచనలు ఇస్తాడు. దేవుడు మనలోనే ఉన్నాడని నమ్ముతాను, అన్నారు. 

ఇక దేవుడి పట్ల గట్టి విశ్వాసం ఉన్నవాళ్లు చాలా మంది ఇలానే ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది. కాకపోతే, దేవుడు నాతో మాట్లాడతాడు అని చెబితే జనాలు ఖచ్చితంగా ఎగతాళి చేస్తారు. నువ్వు అంతటి పరమ భక్తుడిగా అని ఎద్దేవా చేస్తారు. సాయి పల్లవి ఇతరుల కామెంట్స్ పట్టించుకోరు. తన అనుభవాన్ని ఓపెన్ గా చెప్పింది. 

బిగ్ బాస్ తెలుగు 8 అప్డేట్స్ ఇక్కడ చూడండి

యాక్టర్ కమ్ డాక్టర్ 

సాయి పల్లవి డాక్టర్ చదివారు. ఆమె జార్జియా దేశంలో మెడిసిన్ పూర్తి చేసింది. చిన్నప్పటి నుండి నటన, డాన్సులు అంటే ఇష్టం. పలు డాన్స్ రియాలిటీ షోలలో సాయి పల్లవి కంటెస్ట్ చేసింది. మలయాళ చిత్రం ప్రేమమ్ తో హీరోయిన్ గా మారింది. 

నేను అంత అందంగా ఉండను. అసలు చివరి వరకు నన్ను ఈ మూవీ హీరోయిన్ గా ఉండనిస్తారా? లేక మధ్యలో తీసేస్తారా? అనే సందేహం సాయి పల్లవిలో ఉండేదట. ఇదే ప్రశ్న ప్రేమమ్ దర్శకుడిని పదే పదే అడిగేదట. ప్రేమమ్ విడుదలై సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవికి బ్రేక్ వచ్చింది. 

తెలుగులో మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా విశేష ఆదరణ దక్కించుకుంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా చిత్రంలో సాయి పల్లవి రోల్ చాలా బలంగా ఉంటుంది. కథ ఆమె పాత్ర చుట్టూ నడిపించాడు దర్శకుడు. ఫిదాలో సొంతగా డబ్బింగ్ చెప్పుకుంది సాయి పల్లవి. ఆమె ప్యూర్ తెలంగాణ మాండలికం మాట్లాడింది. 

when heroine sai pallavi said god used to speak with me ksr

సాయి పల్లవి అప్ కమింగ్ మూవీస్ 

సాయి పల్లవి చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శివ కార్తికేయన్ కి జంటగా నటించిన అమరన్ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మించడం విశేషం. రన్బీర్ కపూర్ కి జంటగా రామాయణం మూవీ చేస్తుంది. ఇది భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్. రెండు మూడు భాగాలుగా విడుదల కానుందని సమాచారం. 

ఇక తెలుగులో నాగ చైతన్యకు జంటగా తండేల్ మూవీ చేస్తుంది. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. తండేల్ మూవీ ఎమోషనల్ లవ్ డ్రామా అట. నాగ చైతన్య జాలరి యువకుడు పాత్ర చేస్తున్నాడట. తండేల్ అక్టోబర్ 11న విడుదల కానుందని సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios