శోభన్ బాబు ఆస్తులపై కన్నేసిన చిరంజీవి డైరెక్టర్, తెలివిగా తప్పించుకున్న సోగ్గాడు!
వందల కోట్ల విలువ చేసే శోభన్ బాబు ఆస్తులపై చిరంజీవి ఫేవరెట్ దర్శకుడు కన్నేశాడట. సోగ్గాడు శోభన్ బాబు తెలివిగా తప్పుకున్నాడట.
శోభన్ బాబు టాలీవుడ్ రిచెస్ట్ హీరోల్లో ఒకరిగా ఉండేవారు. ఆయన సంపాదించిన ఆస్తి ప్రస్తుత విలువ వేల కోట్లు. కాగా ఓ డైరెక్టర్ ఆయన్ని సగం ఆస్తి అడిగాడట. అందుకు కారణం ఆ డైరెక్టర్ కి శోభన్ బాబు పోలికలు ఉండటమే. అప్పుడు శోభన్ బాబు ఏం చేశారంటే..
ఆస్తుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో పోటీ
శోభన్ బాబు పరిశ్రమలో క్రమశిక్షణ గల నటుడు. హీరోగా సుదీర్ఘ కాలం పరిశ్రమలో కొనసాగాడు. సంపాదించిన ప్రతి రూపాయి పెట్టుబడిగా మార్చాడు. శోభన్ బాబు తోటి నటులకు ఆర్థిక విషయాల్లో సలహాలు ఇచ్చేవాడట. భూమి మీద పెట్టుబడి పెడితే వందల రెట్లు లాభం వస్తుందని చెప్పేవాడట. చెన్నై పరిసర ప్రాంతాల్లో శోభన్ బాబు చాలా ఆస్తులు కొనుగోలు చేశాడని సమాచారం.
ఇక శోభన్ బాబు వద్దంటున్నా కొన్ని స్థలాలు అమ్మి వందల కోట్లు నష్టపోయానని నటుడు చంద్ర మోహన్ గతంలో వాపోయారు. శోభన్ బాబు సలహాలు విని లాభాలు పొందిన నటులు కూడా ఉన్నారు. శోభన్ బాబు డబ్బు విషయంలో అంత నిక్కచ్చిగా ఉండేవారట. నటుడిగా సంపాదించిన ప్రతి రూపాయిని శోభన్ బాబు ఇన్వెస్ట్ చేశారట. అందుకే ఆస్తుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో శోభన్ బాబు పోటీ పడ్డారు.
శోభన్ బాబు ఫ్యామిలీ
తన కొడుకును చిత్ర పరిశ్రమకు శోభన్ బాబు తీసుకు రాలేదు. శోభన్ బాబుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన కుమారుడి పేరు కరుణ శేషు. వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు. చెన్నైలో రియల్ ఎస్టేట్ తో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నారు.
శోభన్ బాబు ఫ్యామిలీ మీడియా కంట పడేది కాదు. చిత్ర పరిశ్రమలో రాజకీయాలు చూసిన శోభన్ బాబు, తన వారసులు పరిశ్రమలో అడుగు పెట్టకూడదని భావించారు. అలాగే పరిశ్రమలో అనిశ్చితి ఎక్కువ. కెరీర్ కి గ్యారంటీ ఉండదు. క్రమశిక్షణ లేకపోతే తేలికగా పాడైపోతారు. డబ్బులు నాశనం చేసుకుంటారు. అందుకే శోభన్ బాబు కొడుకును హీరో చేయలేదు.
శోభన్ బాబు ఆస్తిలో వాటా అడిగిన డైరెక్టర్
కాగా ఓ స్టార్ డైరెక్టర్ శోభన్ బాబును సగం ఆస్తి అడిగాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ఏ కోదండరామిరెడ్డి. 80-90లలో ఏ కోదండరామిరెడ్డి స్టార్ డైరెక్టర్. ఆయన్ని అందరూ మీరు శోభన్ బాబులా ఉంటారు అనేవారట. శోభన్ బాబుతో కోదండరామిరెడ్డికి అనుభవం ఉంది. వీరి కాంబోలో ప్రేమ మూర్తులు, ఇద్దరూ ఇద్దరే, బావ మరదళ్ళు వంటి చిత్రాలు తెరకెక్కాయి.
ఓ సందర్భంలో ఏ కొండరామిరెడ్డి... అందరూ నన్ను మీలా ఉన్నాను అంటున్నారు. కాబట్టి మీ ఆస్తిలో సగం నాకు ఇవ్వండి, అన్నాడట. అందుకు శోభన్ బాబు... తీసుకోరా, కాకపోతే నా ఆస్తులన్నీ పిల్లల పేరిట రాసేశాను. నా కంటూ ఎలాంటి ఆస్తి లేదు అన్నాడట. ఈ విషయాన్ని కోదండరామిరెడ్డి ఓ సందర్భంలో వెల్లడించారు.
ఈ సంఘటన శోభన్ బాబుకు ఎంత ఆస్తి ఉందో చెప్పడానికి నిదర్శనం. తనకంటే పెద్ద స్టార్స్ అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వద్ద లేని సంపద, ఆస్తి శోభన్ బాబు సొంతం. అందుకు ఆయన ఆర్థిక క్రమశిక్షణ, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కారణం అయ్యాయి.
చిరంజీవి దశను మార్చేసిన డైరెక్టర్
ఏ కోదండరామిరెడ్డి స్టార్ డైరెక్టర్ గా చక్రం తిప్పాడు. అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇచ్చారు. ముఖ్యంగా చిరంజీవి దశను మార్చేసిన దర్శకుడు ఏ కోందండరామిరెడ్డి అనడంలో సందేహం లేదు. 1983లో వచ్చిన ఖైదీ టాలీవుడ్ రికార్డులను తుడిచిపెట్టింది. చిరంజీవికి భారీ ఇమేజ్ తెచ్చిపెటింది.
చిరంజీవి-కోదండరామిరెడ్డి కాంబోలో విజేత, కొండవీటి దొంగ, పసివాడి ప్రాణం, ముఠామేస్రి తో పాటు పలు హిట్ చిత్రాలు తెరకెక్కాయి. ముఠామేస్త్రి అనంతరం వీరు కలిసి చిత్రాలు చేయలేదు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయనే పుకార్లు వినిపించాయి.
ఈ పుకార్లను ఓ ఇంటర్వ్యూలో ఏ కోదండరామిరెడ్డి ఖండించారు. ప్రత్యేకంగా కలవకపోయినా ఎదురుబడితే పలకరించుకుంటామని ఆయన అన్నారు. 156 చిత్రాల్లో ఐదు వందలకు పైగా సాంగ్స్ లో డాన్స్ చేసిన చిరంజీవి 24000 స్టెప్స్ తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పాడు. హైదరాబాద్ వేదికగా ఈ అవార్డు వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర ప్రముఖులతో పాటు ఏ కోదండరామిరెడ్డి సైతం హాజరయ్యారు.