బాలీవుడ్‌ స్టార్ వారసురాలు ఐరా ఖాన్‌ వర్క్‌ అవుట్ వీడియోలో ఓ స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఆ గెస్ట్ మరెవరో కాదు ఐరా తండ్రి, బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్. వీడియోలో ఐరా తన ఫిట్‌నెస్ ట్రైనర్‌ డేవిడ్‌ తో కలిసి ఆన్‌లైన్‌లో వర్క్‌ అవుట్‌  చేస్తుండగా ఆమిర్‌ వచ్చిన సడన్‌గా సర్‌ప్రైజ్‌  చేవాడు. డేవిడ్‌ మరెవరో కాదు ధూమ్‌ 3, పీకే సినిమాల కోసం ఆమిర్‌ ట్రైన్ చేసింది కూడా డేవిడే.

వీడియోలోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమిర్‌ను డేవిడ్‌ మీరు కూడా సెషన్‌లో జాయిన్ అవుతారా అంటూ ప్రశ్నించాడు. దానికి సమాధానం ఇచ్చిన ఆమిర్‌ అదేం లేదు కేవలం హాయ్ చెప్పేందుకు మాత్రమే వచ్చానని రిప్లై ఇచ్చాడు. అయితే ఐరా మాత్రం నెక్ట్స్ నాన్నకు వర్క్‌ అవుట్‌ సెషన్‌కు వచ్చేలా వత్తిడి చేస్తానంటూ చెప్పింది.

మంగళవారం ఆమిర్‌ ఖాన్ అభిమానులకు షాకింగ్ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. తన ఇంట్లోనే పని వారికి కరోనా పాజిటివ్ అని తేలిందన్న ఆమిర్, వారిని క్వారెంటైన్‌కు తరలించామని తెలిపాడు, అదే సమయంలో తన కుటుంబ సభ్యులందరికీ నెగెటివ్‌ వచ్చిందని, తన తల్లికి మాత్రం ఇంకా టెస్ట్ చేయాల్సి ఉందని, ఆమెకు కూడా నెగెటివ్‌ రావాలని ప్రార్ధించండి అంటూ సోషల్ మీడియా వేదిక అభిమానులను కోరాడు.