ప్రభాస్‌ లైఫ్‌లో అమ్మాయి మ్యాటర్‌, ఆయన వ్యాపారవేత్త కావాలనుకునే డ్రీమ్‌ వంటి విషయాలు బయటకు వచ్చాయి. దీంతోపాటు మరో ఆసక్తికర విషయం వెల్లడించారు ఫ్రెండ్‌, హీరో గోపీచంద్‌.

ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌, త్వరలో గ్లోబల్‌ స్టార్‌ కాబోతున్నారని చెప్పొచ్చు. `సలార్‌`, నాగ్‌ అశ్విన్‌ `ప్రాజెక్ట్ కే` సక్సెస్‌ అయితే ప్రభాస్‌ని ఆపడం, తట్టుకోవడం ఎవరికి తరం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతంగా గుంబనంగా ఉన్న ఆయన విస్పోటనం చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఎప్పుడూ ఏ టీవీ షోస్‌లోనూ పాల్గొని, మీడియాకి దూరంగా ఉండే ప్రభాస్‌ ఇటీవల బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` సీజన్‌ 2 షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆయన పాల్గొన్ని ఎపిసోడ్లు విడుదలయ్యాయి. 

మొదటి పార్ట్ ఇప్పటికే రిలీజ్‌ కాగా, శుక్రవారం రెండో పార్ట్ రిలీజ్‌ అయ్యింది. ఇందులో ఆసక్తికర విసయాలు వెల్లడయ్యాయి. ప్రభాస్‌ లైఫ్‌లో అమ్మాయి మ్యాటర్‌, ఆయన వ్యాపారవేత్త కావాలనుకునే డ్రీమ్‌ వంటి విషయాలు బయటకు వచ్చాయి. దీంతోపాటు మరో ఆసక్తికర విషయం వెల్లడించారు ఫ్రెండ్‌, హీరో గోపీచంద్‌. రెండో పార్ట్ లో గోపీచంద్‌ కూడా ఉన్నారు. ఇందులో ప్రభాస్‌కి చిరాకు వేస్తే ఏం చేస్తాడనే ప్రశ్న బాలకృష్ణ నుంచి వచ్చింది. దీనికి గోపీచంద్‌ షాకిచ్చే ఆన్సర్‌ ఇచ్చారు. అతి పెద్ద సీక్రెట్‌ బయటపెట్టాడు.

ప్రభాస్‌కి చిరాకేస్తే అందరిని వెళ్లిపోండని చెబుతాడట. అందరికి దూరంగా ఒంటరిగా కూర్చొని స్మోక్‌ చేస్తాడని వెల్లడించారు. స్మోక్‌ చేస్తాడనే విషయాన్ని గోపీచంద్‌ సైగలతో చెప్పడం విశేషం. అయితే ఇది చూసి ప్రభాస్‌ నవ్వులు పూయించడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రభాస్‌ హోటల్‌ బిజినెస్‌లో అడుగుపెట్టాలనుకున్నారట. తనకు ఫుడ్‌ అంటే ఇష్టమని, అందుకే ఆ వ్యాపారం చేయాలనుకున్నారట. అనుకోకుండా హీరో అయ్యానని తెలిపారు. అన్నట్టు ప్రభాస్‌ తన సినిమా షూటింగ్‌లో తోటి ఆర్టిస్టులకు కడుపునిండా భోజనం పెట్టిస్తాడనే విషయం తెలిసిందే. రకరకాల వంటకాలతో పసందైన ఫుడ్‌ పెడతారని చాలా మంది ఆర్టిస్టులు తెలిపారు. 

ప్రభాస్‌ ప్రస్తుతం `ఆదిపురుష్‌`, `సలార్‌`, `ప్రాజెక్ట్ కే`, `రాజా డీలక్స్` చిత్రాల్లో నటిస్తున్నారు. రామాయణం ఆధారంగా ఓం రౌత్‌ `ఆదిపురుష్‌` తెరకెక్కుతుంది. కృతి సనన్‌ సీతగా నటించే ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్‌ కానుంది. మరోవైపు ప్రశాంత్‌ నీల్‌తో `సలార్‌` చేస్తున్నారు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది. నాగ్‌ అశ్విన్‌తో `ప్రాజెక్ట్ కే` చేస్తుండగా, ఇది వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. మరోవైపు మారుతితోనూ ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్‌రావాల్సి ఉంది.