Asianet News TeluguAsianet News Telugu

#Gunturkaaram చిత్రం USP ఏమిటి, ఏం నమ్మి మహేష్ చేసారు?

సినిమా అద్భుతంగా వచ్చిందని.. తమన్‌ మ్యూజిక్‌ మరోస్థాయిలో ఉండనుందన్నారు. సంక్రాంతికి ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చెప్పబడుతున్న ఈ సినిమా  

What is the USP of the  #Gunturkaaram film? jsp
Author
First Published Jan 6, 2024, 1:49 PM IST

అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం గుంటూరు కారం. యాక్షన్‌ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్. ఈ సినిమా ప్రమోషన్ మెటీరియల్ జనాల్లోకి వెళ్ళిపోయింది.  లిరికల్‌ సాంగ్స్‌ లక్షల వ్యూస్‌తో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ షో విషయంలో రికార్డు సృష్టించింది.

‘గుంటూరు కారం’ కోసం జనవరి 11న అమెరికాలో 5,408 ప్రీమియర్‌ షోలు వేయనున్నారు. ఒక తెలుగు సినిమాకు ఇన్ని షోలు వేయడం రికార్డని చిత్రబృందం తెలిపింది. తాజాగా దీని విజయంపై నిర్మాత మరోసారి ధీమా వ్యక్తం చేశారు. సినిమా అద్భుతంగా వచ్చిందని.. తమన్‌ మ్యూజిక్‌ మరోస్థాయిలో ఉండనుందన్నారు. సంక్రాంతికి ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చెప్పబడుతున్న ఈ సినిమా  USP ఏమిటి అనేది చూద్దాం. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా లో మహేష్ మాస్ క్యారక్టరైజేషన్ కొత్తగా ఉంటుందట. ఇప్పటిదాకా మహేష్ చిత్రాల్లో కనపడని కొత్తదనం ఈ పాత్రంలో ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ హైలెట్ గా ఉంటుందట. తల్లి కోసం మహేష్ ఎంతదూరం వెళ్తాడు. అదే కొత్తగా ఉంటుంది. చాలా ఎమోషనల్ గా కట్టిపారేస్తుందని చెప్తున్నారు. 
  
ఇక ‘‘సినిమా అద్భుతంగా వచ్చింది. తమన్‌ మ్యూజిక్‌ మరోస్థాయిలో ఉండనుంది. ఫస్టాఫ్‌ రీరికార్డింగ్‌ పూర్తయింది. సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ మూవీ ఇది. ఫస్టాఫ్‌లో వచ్చే ఫైట్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. చివరి 45 నిమిషాలు సినిమా అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌ట్రా షోల కోసం ప్రయత్నిస్తున్నాం’’ అని నాగవంశీ ఇటీవల సోషల్‌ మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.  శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా .. యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి.

‘‘చాలా కాలం నుంచి మహేశ్‌తో సినిమా చేయాలనుకుంటున్నా. ‘గుంటూరుకారం’తో అది నెరవేరింది. సినిమా అద్భుతంగా వచ్చింది. తమన్‌ మ్యూజిక్‌ మరోస్థాయిలో ఉండనుంది. ఫస్టాఫ్‌ రీరికార్డింగ్‌ పూర్తైంది. సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ మూవీ ఇది. ఫస్టాఫ్‌లో వచ్చే ఫైట్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. చివరి 45 నిమిషాలు సినిమా అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌ట్రా షోల కోసం ప్రయత్నిస్తున్నాం. థియేటర్ల జాబితా ఇంకా ఫైనల్‌ కాలేదు’’ అని ఆయన చెప్పారు.  
 
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios