Asianet News TeluguAsianet News Telugu

‘టైగర్ నాగేశ్వర రావు’ రన్ టైమ్ ఎంతో తెలుసా? థర్డ్ సాంగ్ అదిరిపోయిందిగా.. డిటేయిల్స్

‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం సరిగ్గా వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా నిడివిపై ఆసక్తికరమైన అప్డేట్ అందింది. మరోవైపు తాజాగా విడుదలైన మూడో పాట కూడా ఆకట్టుకుంటోంది.  
 

What is the Tiger Nageswara Rao  movieRuntime and Third song out now NSK
Author
First Published Oct 13, 2023, 5:36 PM IST | Last Updated Oct 13, 2023, 5:38 PM IST

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja)  హీరోగా `టైగర్‌ నాగేశ్వరరావు` (Tiger Nageswara Rao)  తెరకెక్కబోతోంది. రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతున్నాయి. ఈ క్రమంలో చిత్రం నిడివిపై ఆసక్తికరమై అప్డేట్ అందింది. ఈ సినిమా ఏకంగా మూడు గంటల పాటు ఉంటుందని తెలుస్తోంది. ‘టైగర్ నాగేశ్వర రావు’ టోటల్ రన్ టైమ్ 3.02 నిమిషాలు ఉంటుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను కూడా అందించింది. 

అయితే ఇంత లాంగ్ రన్ టైమ్ తో ఇటీవల సినిమాలేవీ రాలేదు. ఈ ఏడాది వచ్చిన సినిమాలన్నీ  రెండున్నర గంటలలోపే ఉన్నవి. ఈ చిత్రం మాత్రం ఆ రూల్ ను బ్రేక్ చేస్తూ ఏకంగా ప్రేక్షకులను థియేటర్లలో మూడు గంటలు కూర్చొబెట్టబోతోంది. ఇక ప్రస్తుతం యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. రవితేజ, నుపూర్ సనన్, డైరెక్టర్, టెక్నీకల్ టీమ్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో సినిమాను వీలైనంతగా ప్రచారం చేస్తున్నారు. సినిమాపై ఆసక్తిని పెంచేలా అప్డేట్ అందిస్తున్నారు. 

ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కుమాసీవ్ రెస్పాన్స్ దక్కింది. రవితేజ యాక్షన్ కు మోతమోగిపోద్దని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చిత్ర యూనిట్ సినిమా పాటలతోనూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలవ్వగా.. తాజాగా రొమాంటిక్  ట్రాక్ ‘ఇచ్చేసుకుంటాలే’ విడుదలై ఆకట్టుకుంటోంది. పాటలు కూడా అదిరిపోవడంతో సినిమాపై మరింత అంచనాలు నెలకొన్నాయి. 

స్టువర్ట్ పురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వంశీ దర్శకుడు.  బాలీవుడ్ బ్యూటీ నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్ కథానాయికలు.  రేణు దేశాయ్‌ కీలక పాత్రలో నటిస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios