Asianet News TeluguAsianet News Telugu

జమున అసలు పేరు... వెనక అసక్తికరమైన విషయం

 ఆ పేరు పెడితే కలిసి వస్తుందని జ్యోతిష్యులు చెప్పారని పెట్టారు. ఆ పేరే కలిసి వచ్చిందని ఆమె చెప్తూండేవారు. ఆమె పెద్దై సినిమాల్లో కి వచ్చాక చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో  జమున అనే పేరు పెట్టుకున్నారు. 

What is the real name of Jamuna
Author
First Published Jan 27, 2023, 11:22 AM IST

జమున అసలు పేరు జానాబాయి. అయితే ఆమె కుటుంబాల్ల్లో  సంప్రదాయ బద్దంగా ..పుట్టగానే నక్ష్తత్రం చూసి పేరు పెట్టేవారు. అలా ఆమె నక్షత్రాన్ని బట్టి ఏదైనా నది పేరు ఉండాలని  ఆమె పేరు మధ్యలో ము అనే అక్షరాన్ని చేర్చి జమున అని పేరు పెట్టారు. ఆ పేరు పెడితే కలిసి వస్తుందని జ్యోతిష్యులు చెప్పారని పెట్టారు. ఆ పేరే కలిసి వచ్చిందని ఆమె చెప్తూండేవారు. ఆమె పెద్దై సినిమాల్లో కి వచ్చాక చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో  జమున అనే పేరు పెట్టుకున్నారు. 

 చదువుకునే రోజుల్లోనే నాటకాలపై ఆకర్షితురాలైన జమున తమ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్న నటుడు జగ్గయ్య ప్రేరణతో, ప్రోత్సాహంతో నాటకాలలో అడుగుపెట్టారు. నాటకాలలో ఆమె ప్రతిపద్వారా సినిమా రంగంలో ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. పుట్టినిల్లు సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన జమున ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య తదితరుల సరసన పలు సినిమాలలో హీరోయిన్ గా నటించారు.
 
అలాగే ఆమె కెరీర్ లో చెప్పుకొదగ్గ సినిమాలుగా విజయావారి 'మిస్సమ్మ' .. 'గుండమ్మ కథ' సినిమాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి. ఇక పౌరాణికాలలో ఆమె చాలా పాత్రలు చేసినప్పటికీ, 'శ్రీకృష్ణ తులాభారం'లో 'సత్యభామ'గా ఆమె తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తరువాత ఎవరూ కూడా ఆమె బాడీ లాంగ్వేజ్ ను మ్యాచ్ చేయలేకపోయారు. అందువలన ఇప్పటికీ తెలుగుతెర సత్యభామ ఎవరంటే .. జమున పేరు మాత్రమే వినిపిస్తుంది.   దొంగరాముడు, తెనాలి రామకృష్ణ, దొరికితే దొంగలు, మురళీకృష్ణ, రాముడు భీముడు, ఇల్లరికం, బొబ్బిలియుద్ధ, పూజా ఫలం, తోడు నీడ, రాము, ఉండమ్మా బొట్టు పెడతా, ఏకవీర, మట్టిలో మాణిక్యం, కురుక్షేత్రం జమున గారు నటించిన సూపర్ హిట్స్ లో కొన్ని. చివరిసారిగా అన్నపూర్ణమ్మ గారి మనవడులో కనిపించారు. సుమారు రెండు వందల సినిమాలు ఆవిడ కీర్తిని శాశ్వతం చేశాయి. 

ఒకానొక సమయంలో అగ్రస్థాయి హీరోలు ఆమె  తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తే, హరనాథ్ .. జగ్గయ్య వంటి వారితోనే కెరియర్ ను నెట్టుకొచ్చిన ఘనత ఆమె సొంతం. ఒక హీరో తాగేసి సెట్ కి వస్తే .. సెట్ లో నుంచి వెళ్లిపోయిన ఆత్మ గౌరవం ఆమెలో కనిపించే ప్రత్యేకత. అందాల తారగా అద్దాల మేడల్లో తిరిగే పాత్రలు మాత్రమే చేయగలదనే విమర్శలకు, 'మూగమనసులు' సినిమాలోని 'గౌరి' పాత్రతో సమాధానం చెప్పిన నైజం ఆమెది.  ఎన్నో విభిన్నమైన ... విలక్షణమైన పాత్రలకు జమున కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ ల గురించి చెప్పుకునేటప్పుడు జమున పేరు రాకుండా .. లేకుండా చేయడమనేది అసాధ్యమైన విషయం.  

Follow Us:
Download App:
  • android
  • ios