‘మహానటి’ విడుదలకు చిరంజీవికి ఏంటి సంబంధం..?

First Published 5, May 2018, 3:00 PM IST
what is the connection between mahanati movie and mega star chiranjeevi
Highlights

మే9వ తేదీనే ఎందుకు విడుదల చేస్తున్నారంటే...

అలనాటి అందాల తార మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ మహానటి’. కీర్తిసురేష్ టైటిల్ రోల్ లో నటించగా.. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్.. సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. లుక్స్ పరంగా కీర్తి.. సావిత్రి గారిని అచ్చం దించేసిందంటూ టీజర్ చూసిన వారంతా ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.  నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే9వ తేదీన విడుదల కానుంది.  ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా విడుదలకి.. మెగా స్టార్ చిరంజీవికి ఓ చిన్న కనెక్షన్ ఉంది.

అందేంటంటే.. `మ‌హాన‌టి` సినిమాను వైజ‌యంతీ మూవీస్ సంస్థ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంస్థ నిర్మించిన వాటిల్లో అత్యంత భారీ విజ‌యం సాధించిన సినిమా `జ‌గ‌దేక వీరుడు-అతిలోక సుంద‌రి`. ఆ సినిమా 1990వ సంవ‌త్సరం మే 9వ తేదీన విడుద‌లైంది. తుఫాను స‌మ‌యంలోనూ రికార్డు స్థాయి క‌లెక్ష‌న్లు సాధించింది. ఆ సెంటిమెంట్‌తోనే `మ‌హాన‌టి` సినిమాను కూడా మే 9వ తేదీనే విడుద‌ల చేస్తున్నార‌ు. చిరంజీవి సినిమాలాగానే.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలవాలని మనం కూడా కోరుకుందాం.
 

loader