Asianet News TeluguAsianet News Telugu

దేవిశ్రీప్రసాద్ రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో సెటైర్లు!

ఏ ఇండస్ట్రీలోనైనా టాలెంట్, పాపులారిటీని బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు. టాలీవుడ్ లో కూడా అంతే.. అయితే ఇక్కడ స్టార్ల రెమ్యునరేషన్ కోట్లలో ఉంటుంది. తమకున్న క్రేజ్, ఫాలోయింగ్ ని బట్టి తారలు పారితోషికం డిమాండ్ చేస్తుంటారు. 

What Is He Delivering At 3 Cr Remuneration?
Author
Hyderabad, First Published Nov 14, 2018, 4:21 PM IST

ఏ ఇండస్ట్రీలోనైనా టాలెంట్, పాపులారిటీని బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు. టాలీవుడ్ లో కూడా అంతే.. అయితే ఇక్కడ స్టార్ల రెమ్యునరేషన్ కోట్లలో ఉంటుంది. తమకున్న క్రేజ్, ఫాలోయింగ్ ని బట్టి తారలు పారితోషికం డిమాండ్ చేస్తుంటారు.

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కూడా తన రేంజ్ ని బట్టి ఒక్కో సినిమాకి రూ.2 నుండి 3 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు.  హిట్ ఆల్బమ్స్ ఇస్తే ఇంతటి పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడరు. కానీ దేవి మాత్రం తన రెమ్యునరేషన్ తగ్గ రేంజ్ లో పని మాత్రం చేయడం లేదని ఇన్సైడ్ వర్గాల టాక్.

ఇటీవల రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' టీజర్ విషయంలో కూడా దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై నెగెటివ్ కామెంట్స్  వినిపించాయి. దేవి కూడా ట్యూన్స్ కాపీ కొడుతున్నాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. రీసెంట్ గా ఆయన మ్యూజిక్ అందించిన చాలా సినిమాల ఆల్బమ్స్ ఏవరేజ్ గా నిలిచాయి. సినిమాలో ఒకట్రెండు తప్ప గుర్తుపెట్టుకునే పాటలు లేవు.

'రంగస్థలం' తప్ప ఈ మధ్యకాలంలో దేవి కెరీర్ లో ఆ స్థాయి హిట్ ఆల్బమ్ పడలేదు. ఇప్పుడు మహేష్ 'మహర్షి' కోసం, నితిన్, నాని, సాయి ధరం తేజ్ వంటి సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. తీసుకుంటున్న మూడు కోట్ల రెమ్యునరేషన్ కి తగ్గట్లుగా తదుపరి సినిమాలకైనా పని చేయాలంటూ సంగీత ప్రియులు కోరుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios