Asianet News TeluguAsianet News Telugu

‘పుష్ఫ 2’లో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉండబోతోంది.. కొత్త లుక్ అదిరిందంట.!

దర్శకుడు సుకుమార్ దర్శకత్వంతో రాబోతున్న ‘పుష్ఫ 2’పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతున్నాయి. ఈ నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుండటంతో అల్లు అర్జున్ లుక్ పై తాజాగా క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది. 
 

What is Allu Arjuns look going to be like in Pushpa 2?
Author
First Published Sep 9, 2022, 2:41 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - సుకుమార్ దర్శకత్వంతో వచ్చిన ‘ఫుష్ఫ’ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిదే. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ రఫ్ లుక్, మాస్ అటిట్యూడ్ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  
గతేడాది డిసెబర్ లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ గా మారింది. ఇప్పటికే ‘పుష్ఫ రాజ్’ మేనరిజం ట్రెండింగ్ లోనే ఉంది. ఇక ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ ‘పుష్ప 2’ (Pushpa 2)ను తెరకెక్కించే పనిలో పడ్డారు. 

ఇటీవలె పుష్ప సీక్వెల్ రెగ్యూలర్ షూటింగ్ కోసం గ్రాండ్ గా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. లేటెస్ట్ గా Pushpa The Rule నుంచి క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో పార్ట్ 2లో అల్లు అర్జున్ ఎలా లుక్ లో  కనిపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా బన్నీకి లుక్ టెస్టింగ్ కూడా జరిగిందంటూ క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సారి అల్లు అర్జున్ కాస్తా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం బాలీవుడ్ ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ప్రీతీ షీల్ అల్లు అర్జున్ కు మేకప్ చేశారంట. ఈ మేకప్ టెస్ట్ లో ‘పుష్ఫ రాజ్’ రఫ్ లుక్ నుంచి కాస్తా భిన్నమైన లుక్ లో కనిపించారని తెలుస్తోంది. 

అయితే ఈ లుక్ పట్ల దర్శకుడు సుకుమార్ (Sukumar) చాలా సంతోషం వ్యక్తం చేశారంట. ఇక ఈ నెల మూడో వారం  22న చిత్రం రెగ్యూలర్ షూటింగ్ జరగనుంది. ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించడంతో  ‘పుష్ప 2’పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. దీంతో సుకుమార్ పార్ట్ 2ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నారు. ఇందుకోసం స్క్రిప్ట్ లోనూ కాస్తా మార్పులు చేసి, మరిన్ని క్యారెక్టర్స్ ను పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios