చడీ చప్పుడు లేకుండా ఎన్టీఆర్ నివాసంలో ఓ పార్టీ జరిగింది. విశేషం ఏమిటనేది తెలియదు. కాగా ఎన్టీఆర్ పార్టీకి రామ్ చరణ్ హాజరుకాలేదు.
ఎన్టీఆర్-రామ్ చరణ్ స్నేహం అలానే ఉందా? బీటలు వారిందా? అనే సందేహాలు ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల తర్వాత జరిగిన పరిణామాలు. అంతర్జాతీయ వేదికలపై దక్కిన ఫేమ్ వంటి విషయాలు దూరం పెంచాయనే వాదన వినిపిస్తోంది. రామ్ చరణ్ మార్చి 27న తన నివాసంలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. చిరంజీవి-రామ్ చరణ్ ఆహ్వానం మేరకు చిత్ర పరిశ్రమ మొత్తం ఈ వేడుకకు తరలి వచ్చింది. దర్శకులు, నిర్మాతలు, హీరోలందరూ కొలువుదీరారు.
ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేదు. అల్లు అర్జున్, పవన్, మహేష్, ప్రభాస్ లు కూడా రాలేదు. కానీ వారిని పరిగణలోకి తీసుకోలేం. చిరంజీవి నివాసంలో జరిగింది రామ్ చరణ్ బర్త్ డే పార్టీ మాత్రమే కాదు.ఆర్ ఆర్ ఆర్ టీమ్ సన్మాన కార్యక్రమం కూడా. ఆస్కార్ విన్నర్స్ చంద్రబోస్, కీరవాణిలను చిరంజీవి దంపతులు సత్కరించారు. రాజమౌళి దంపతులను కూడా గౌరవించుకున్నారు. రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ సక్సెస్ కి ముడి పడి ఉన్న తరుణంలో ఎన్టీఆర్ రావాల్సిన అవసరం ఉంది.

ఎన్టీఆర్ రాకపోవడానికి మనస్పర్థలే కారణమన్న వాదన వినిపించింది. ఇక రామ్ చరణ్ కి పొడిపొడిగా బర్త్ డే విషెస్ చెప్పిన ఎన్టీఆర్... అల్లు అర్జున్ కి బావ అని సంబోధిస్తూ ప్రేమ కురిపించారు. బన్నీ-ఎన్టీఆర్ ట్విట్టర్ లో సరసాలు ఆడుకున్నారు. ఇది చరణ్ అభిమానులకు మండేలా చేసింది. విడ్డూరం ఏంటనే ఎన్టీఆర్, బన్నీ అభిమానుల్లో కొందరు కామన్ ఫ్యాన్స్ గా మారిపోయారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ సడన్ గా గురువారం డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారు.ఆయన నివాసంలో జరిగిన ఈ పార్టీకి అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. రాజమౌళి, మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఒకరిద్దరు పరిశ్రమ పెద్దలు హాజరయ్యారు. చరణ్ పార్టీతో పోల్చితే ఎన్టీఆర్ పార్టీ తేలిపోయింది. అయితే ఎన్టీఆర్ అందరినీ ఆహ్వానించలేదు. ఇది కేవలం ప్రైవేట్ పార్టీ అనే ప్రచారం జరుగుతుంది.

అదే సమయంలో చరణ్, చిరంజీవికి ఇచ్చిన ప్రాధాన్యత పరిశ్రమ ఎన్టీఆర్ కి ఇవ్వలేదని మరో వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ పార్టీకి పరిశ్రమ నుండి స్పందన లేదు. కాగా రామ్ చరణ్ హాజరు కాకపోవడం చర్చకు దారి తీసింది. ఎన్టీఆర్ తన బర్త్ డే పార్టీకి రాని కారణంగా రామ్ చరణ్ డుమ్మా కొట్టారని అంటున్నారు. రామ్ చరణ్, ఉపాసన దుబాయ్ ట్రిప్ లో ఉన్నారు. అందుకే రాలేకపోయారని, మరో కారణం లేదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా రామ్ చరణ్, ఎన్టీఆర్ పోటాపోటీగా పార్టీలు ఏర్పాటు చేయడం కొత్త చర్చకు దారితీస్తోంది. కొద్దిరోజుల్లో ఎన్టీఆర్ బర్త్ డే కాగా... అప్పుడు ఎన్టీఆర్ మరో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసే ఆస్కారం కలదంటున్నారు.
