జూన్ 29 కాకుండా ఇంకో వారం పాటు వాయిదా వేస్తె, ప్రచారాలకి సమయం దొరుకుతుందని నిఖిల్ వాదన అనీ, కానీ నిర్మాత ఒప్పుకోలేదని తెలిసింది. 


 నిఖిల్ 'స్పై' #Spy అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్నటి నుంచీ నిఖిల్ కి, నిర్మాత కి పడటం లేదని, ఇద్దరి మధ్య చిన్న పాటి యుద్దం నడుస్తోందని వార్తలు వస్తున్నాయి. రిలీజ్ డేట్‌, ప్ర‌మోష‌న్స్ విష‌యంలో హీరో నిఖిల్‌(Nikhil), నిర్మాత కె. రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు నెల‌కొన్న‌ట్లు చెప్తున్నారు. ఈ విభేదాల కార‌ణంగా సినిమా ప్ర‌మోష‌న్స్‌కు నిఖిల్ దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు నిఖిల్ డ‌బ్బింగ్ చెప్ప‌డానికి నిరాక‌రించిన‌ట్లు స‌మాచారం. అయితే నిఖిల్ డబ్బింగ్ చెప్పకున్నా ... టెక్నాలజీ వాడి.. సినిమా పూర్తి చేసి విడుదల చేసేందుకే.. నిర్మాత సన్నాహాలు..చేస్తున్నట్లు వినపడుతోంది. 

వివాద విషయంలోకి వస్తే.. ఈ సినిమా ప్రచారం కూడా చాలా అట్టహాసంగా ఢిల్లీ లో మొదలెట్టారు. ఇది ఒక్క తెలుగులోనే కాకుండా, అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. అందుకని ఈ సినిమా పబ్లిసిటీ కూడా అలాగే ఉండాలని నిఖిల్ అనుకోవటంలో తప్పేమీ లేదు. ప్యాన్ ఇండియా లెవిల్లో అన్ని రాష్ట్రాల పబ్లిసిటీ ఖర్చు తను పెట్టాలంటే సినిమా మీద భారీ భారం... అందుకే నిర్మాత ఇష్ట పడడం లేదు. అందుకే నిర్మాత తెలుగు రాష్టాలను టార్గెట్ చేస్తూ రిలీజ్ కు రెడీ అయ్యిపోతున్నట్లు చెప్తున్నారు.

ఈ సినిమా ఈనెల 29న విడుదల అవుతోంది. అయితే ఈ సినిమాలోని కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌కు సంబంధించిన షూట్ బ్యాలెన్స్‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. అలాగే గ్రాఫిక్స్ వ‌ర్క్ కూడా పెండింగ్ ఉన్న‌ట్లు చెబుతోన్నారు. రిలీజ్‌కు మ‌రో ప‌ద్దెనిమిది రోజుల వ‌ర‌కు టైమ్ ఉండ‌టంతో ఆ లోగా పెండింగ్ వ‌ర్క్‌ను పూర్తిచేసి సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో నిర్మాత ఉన్న‌ట్లు తెలిసింది. 

క్వాలిటీ విష‌యంలో కాంప్ర‌మైజ్ కావ‌డం ఇష్టం లేక‌పోవ‌డంతో ఈ విష‌యంలో నిర్మాత‌తో నిఖిల్ విభేదించిన‌ట్లు చెబుతోన్నారు. షూటింగ్‌తో పాటు ప్ర‌మోష‌న్స్‌కు టైమ్ తీసుకుంటే బాగుంటుంద‌ని, సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదావేయ‌మ‌ని నిర్మాత‌ను అత‌డు కోరిన‌ట్లు చెబుతోన్నారు. నిఖిల్ రిక్వెస్ట్‌ను ప్రొడ్యూస‌ర్ ప‌ట్టించుకోలేద‌ని తెలిపింది. నిఖిల్ ప్ర‌మేయం లేకుండానే 29న సినిమా రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయిన‌ట్లు తెలిసింది. ప్ర‌మోష‌న్స్ కూడా మొద‌లుపెట్టారు. అక్కడే వచ్చింది గొడవ అంటున్నారు.

 ఈ సినిమా నేపధ్యం స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ (SubhashChandrabose) చనిపోయారా, బతికున్నారా, ఉంటే ఎక్కడున్నారు, ఎలా మాయం అయ్యారు అనే ఒక మిస్టరీ కథ ఆధారంగా వస్తున్న సినిమా ఇది. స్పై సినిమాలో ఐశ్వ‌ర్య మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా, ఆర్య‌న్ రాజేష్,స‌న్యా ఠాకూర్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. స్పై సినిమాతో ఎడిట‌ర్ గ్యారీ బీ హెచ్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.