Asianet News TeluguAsianet News Telugu

దీపావళి సినిమాల్లో ఏది బెస్ట్ ? ... 'ఎనిమీ' తెలుగు పరిస్థితి ఏంటీ?

వాడు వీడు చిత్రంతో విలక్షణ నటులుగా పేరొందిన ఆర్య, విశాల్ కాంబో లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’ (Enemy) విడుదలైంది. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ ఇద్దరు హీరోలు అదరగొట్టేశారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా.. ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటించారు.
 

What about Enemy movie at the Telugu box office
Author
Hyderabad, First Published Nov 9, 2021, 3:41 PM IST

ఈసారి దీపావ‌ళి బ‌రిలో డబ్బింగ్ చిత్రాల జోరు క‌నిపించింది. ర‌జ‌నీకాంత్ ‘పెద్ద‌న్న’అంటూ పండ‌గ బ‌రిలో దిగ‌గా.. ఆయ‌న‌కు పోటీగా ‘ఎనిమి’(Enemy)తో రేసులోకి దిగారు విశాల్‌(vishal), ఆర్య‌(arya). ‘వాడు వీడు’ త‌ర్వాత  ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన రెండో చిత్ర‌మిది. విభిన్న‌మైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా అంటూ ప్రమోట్ చేసారు.  పాట‌లు,ట్రైలర్స్ ఇంట్రస్టింగ్ గా  ఉండ‌టంతో  సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి ఎక్సపెక్టేషన్స్ ఏర్ప‌డ్డాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ చిత్రం ఏమేర అందుకుంది? అటే అందుకోలేదనే చెప్పాలి.   

తమిళంలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న Enemyకి ఇక్కడ జస్ట్ ఓకే అనే టాక్ వచ్చింది.  సాధారణం గా అయితే Vishal సినిమాలు యావరేజ్ టాక్ దక్కించుకుంటే ఫ్లాఫ్ క్రింద లెక్కే. పెద్దగా వసూళ్లు ఉండవు. కాని బాక్సాఫీస్ వద్ద మొత్తం మూడు విడుదల అవ్వగా ఆ రెండు అట్టప్ ప్లాప్ అనిపించుకోవడంతో మిగిలి ఉన్న ఒక్క సినిమా ఎనిమీ పర్వాలేదు అనే టాక్ ను దక్కించుకుంది కనుక వసూళ్లు అటు వైపు ఫరవాలేదన్నట్లుగా ఉంటున్నాయని ట్రేడ్ అంటోంది. దాంతో దీపావళి వీక్ లో విడుదల అయిన సినిమాల్లో మెజార్టీ వసూళ్ల వాటను ఎనిమీ దక్కించుకున్నట్లు అయ్యింది. 

మరో ప్రక్క రజినీకాంత్(Rajinikanth) నటించిన పెద్దన్న సినిమా మొదటి రెండు రోజులు హంగామా చేసినా ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దాంతో ఎనిమీ సినిమా కు కలిసి వచ్చి వసూళ్ల పంట పండించుకుంది. తెలుగు రైట్స్ ను దక్కించుకున్న వారికి బ్రేక్ ఈవెన్ లభించిందని అంటున్నారు. విశాల్ సినిమాలు గతంలో తెలుగు లో మంచి వసూళ్లను దక్కించుకున్నాయి. వాటితో పోల్చితే ఈ సినిమా వసూళ్లు తక్కువే అయినా కూడా దీపావళికి విడుదల అయిన ఇతర రెండు సినిమాలతో పోల్చితే మాత్రం ఎనిమీది పై చేయి అయినట్లే అంటున్నారు. 

మరో ప్రక్క తెలుగు బాక్సాఫీస్ వద్దకు డైరెక్ట్ సినిమా మంచి రోజులు వచ్చాయి వచ్చింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆ విషయాన్ని స్వయంగా మారుతి కూడా ఒప్పుకున్నాడు. ప్రేక్షకులు కోరుకున్నట్లుగా మేము ఎంటర్ టైన్ మెంట్ ను ఇవ్వలేక పోయామని చెప్పేశాడు. ఇక తమిళ అన్నాత్తే ను తెలుగు లో పెద్దన్నగా విడుదల చేస్తే అది మార్నింగ్ షోకే  బొక్క బోర్లా పడింది. 

also read: enemy movie review: విశాల్‌ `ఎనిమీ` సినిమా రివ్యూ
 

Follow Us:
Download App:
  • android
  • ios