Asianet News TeluguAsianet News Telugu

#Salaar వీకెండ్ భాక్సాఫీస్ రిజల్ట్.. ఒకటే పదం

భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యిన ఈ చిత్రం తెలుగు రెండు రాష్ట్రాల్లో దుమ్ము రేపుతోంది. అలాగే   USA, గల్ప్ కంట్రీలలోనూ తన సత్తా చూపుతోంది. 
 

Weekend box office Prabhas #Salaar achieves extraordinary numbers jsp
Author
First Published Dec 26, 2023, 10:46 AM IST

ప్రభాస్‌ (Prabhas) అభిమానులు, సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా..? అని ఆసక్తిగా గత సంవత్సర కాలంగా ఎదురుచూసిన ‘సలార్’ (Salaar) చిత్రం మొన్న శుక్రవారం థియేటర్లలోకి సందడి చేస్తోంది. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యిన ఈ చిత్రం తెలుగు రెండు రాష్ట్రాల్లో దుమ్ము రేపుతోంది. అలాగే   USA, గల్ప్ కంట్రీలలోనూ తన సత్తా చూపుతోంది. ‘కేజీయఫ్‌’లో నరాచీ ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్‌ నీల్‌.. ‘సలార్‌’తో ఖాన్సార్‌ వరల్డ్‌ని పరిచయం చేసారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే ఈ సినిమా కథాంశం.  దేవ- వరదరాజ మన్నార్‌ శత్రువులుగా మారడానికి కారణమేంటి?అని ఉత్సాహంగా చర్చించుకుంటూ థియేటర్స్ కు జనం వెళ్తున్నారు.. అసలు ఖాన్సార్‌ కథేంటి? అనేది సోషల్ మీడియా డిస్కషన్ గా మారింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం వీకెండ్, క్రిస్మస్  కలెక్షన్స్  చూసి ఒకటే పదం అంటున్నారు అది ఎక్సార్డనరీ. ఆ కలెక్షన్స్ వివరాలు చూద్దాం.
 
ఈ చిత్రం రెవిన్యూ పరంగా మూడు రోజుల్లో తెలంగాణాలో కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. క్రిస్మస్ రోజు కుమ్మేసింది. న్యూఇయిర్ అంటే మరో నాలుగు రోజులు పాటు  ఇదే పాట్రన్ కొనసాగితే  నైజాం డిస్ట్రిబ్యూటర్స్ కు ముందే సంక్రాంతి వచ్చినట్లవు. మైత్రీమూవీ మేకర్స్ వారు ఈ చిత్రం రైట్స్ ని 65 కోట్లు భారీ మొత్తానికి వెచ్చించి తీసుకున్నారు. అంత వెనక్కి వస్తుందా అని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడున్న స్పీడు చూస్తూంటే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. నాలుగు రోజుల్లో 50కోట్లకుపైగా షేర్‌ సాధించింది. మరో రెండు మూడు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ కానుంది. ఆ తర్వాత ఇక పండగే. 

ఆంధ్రాలోనూ భారీ నెంబర్స్ నమోదు అవుతున్నాయి. గతంలో వచ్చిన హైయిస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్ లతో పోలిస్తే వాటి రికార్డ్ లు బ్రద్దలు కొట్టే దిశలో ప్రయాణం పెట్టుకుందిసలార్. ప్రతీ సెంటర్ ఈ వీకెండ్,క్రిస్మస్ లో హౌస్ ఫుల్స్ చూసారు. సంక్రాంతికి ముందు ఇలాంటి వాతావరణం వారు ఎక్సపెక్ట్ చేయలేదంటున్నారు.
 
నార్త్ అమెరికాలో అయితే మూడు రోజుల్లోనూ  $5.5 million (Rs 45.5 Cr)రెవిన్యూ వచ్చింది. ప్రభాస్ కెరీర్ లో హైయిస్త్ గ్రాసింగ్ ఫిల్మ్ లో మూడవదిగా చెప్తున్నారు.  మొదటి రెండూ బాహుబలి ,బాహుబలి 2. ప్రభాస్  పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హసన్ కీలక పాత్రలు పోషించిన   సలార్ సినిమా తొలి భాగం ‘సలార్- సీజ్ ఫైర్’తెలుగు భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ చూసి  రెండో భాగం ‘శౌర్యాంగ పర్వం’ఎప్పుడూ అని అడుగుతున్నారు. అయితే ఇది ప్యాన్ ఇండియా సినిమా. కేవలం తెలుగు మార్కెట్ మాత్రమే కాదు ...హిందీ, కన్నడ, మళయాళ,తమిళ మార్కెట్ లలో కూడా అక్కడ భాషల్లోకి డబ్బింగ్ అయ్యి భారీగా రిలీజ్ అయ్యింది.  

Follow Us:
Download App:
  • android
  • ios