టాలీవుడ్ అగ్ర దర్శకుడు దిల్ రాజు ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు తమ్ముడు కొడుకు హర్షిత్ కి మరో నాలుగు రోజుల్లో వివాహంజరగనుంది. హర్షిత్ తెలుగులో 'లవర్' అనే సినిమాను నిర్మించాడు. 

రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా నిర్మాతగా హర్షిత్ కి నిరాశనే మిగిల్చింది. నిర్మాతగా ప్రయత్నం బెడిసి కొట్టినప్పటికీ దిల్ రాజు బ్యానర్ లో వచ్చే సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటూ బిజీగా ఉన్నాడు.

ఇప్పుడు పెళ్లి కొడుకు అవతారంలో దర్శనమివ్వనున్నాడు. ఆథోనీ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి కూతురు గౌతమితో ఇటీవల హర్షిత్ కి నిశ్చితార్ధం జరిగింది. ఈ నెల 21న తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు గోవాలో వివాహం జరగనుంది.

ఈ పెళ్లికి టాలీవుడ్ కి చెందిన కొంతమంది దర్శకనిర్మాతలతో పాటు హీరోలకి కూడా ఆహ్వానం అందిందని తెలుస్తోంది. 23న హైదరాబాద్ లో ఓ కన్వెన్షన్ సెంటర్ లో వివాహ విందు ఏర్పాటు చేయబోతుంది దిల్ రాజు ఫ్యామిలీ. ఈ వేడుకలో మాత్రం టాలీవుడ్ కి చెందిన దాదాపు అందరూ సెలబ్రిటీలు కనిపించనున్నారు.