సీనియర్ హీరోయిన్స్  జ్యోతిక, రేవతి ఇద్దరూ ఇప్పుడు తమిళనాట ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు. అందురూ వీళ్ళద్దరి విశ్వరూపం చూసి ఆశ్చర్యపోతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రూపొందిన జాక్ పాట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జ్యోతిక భర్య స్టార్ హీరో సూర్య స్వయంగా నిర్మించిన ఈ చిత్రం క్రైమ్ కామెడీగా తెరకెక్కింది. ఈ చిత్రం ట్రైలర్ చూసి హిట్ గ్యారంటీ అంటున్నారు. మీరూ ఓ లుక్కేయండి.  

ఈ ట్రైలర్ లో రేవతి, జ్యోతికలు ఇద్దరూ రకరకాల వేషాలు వేసి మేసగాళ్లకే మోసగత్తెలుగా మారతారు. డాక్టర్, పోలీస్ ఇలా ఒక్కోసారి ఒక్కోరకంగా కనపడుతూ ఫైట్స్ చేస్తూంటారు. ఆ క్రమంలో వీళ్లకు ఇద్దరు డాన్స్ (మన్సూర్ అలీ ఖాన్-మోహన్ రాజ్)తో గొడవ ఏర్పడుతుంది.  అక్కడ నుంచి జైలుకు వెళ్తారు. అసలు వీళ్లద్దరు ఇలా చెలరేగిపోవటానికి కారణమైన ప్లాష్ బ్యాక్ ఏమిటి...వీళ్లకు తగిలిన జాక్ పాట్ ఏమిటనేది అసలు కథ.  వెనుక ఉన్న కథేంటి వీళ్లకు తగిలిన జాక్ పాట్ ఏంటి అనేదే అసలు కథ.

యాక్షన్ ఎమోషన్ సెంటిమెంట్ మిక్స్ చేసిన ఈ సినిమాని ఈ  ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ ని  తీసుకుని దర్శకుడు కళ్యాణ్ నడిపించడం ఆసక్తి రేపింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం  ఇచ్చిన ఈ సినిమాపై తమిళనాట మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులోనూ ఈ సినిమాని డబ్ చేసే అవకాసం ఉంది.