రైలుకిందపడి కుటుంబం మొత్తం ఆత్మహత్య

First Published 29, Mar 2018, 11:36 AM IST
warangal suicide
Highlights
రైలుకిందపడి కుటుంబం మొత్తం ఆత్మహత్య

వరంగల్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం మొత్తం రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. రైలు పట్టాలపై మృతదేహాలు ముక్కలు ముక్కులగా పడిఉన్నాయి. 

వివరాల్లోకి వెళితే వరంగల్ అర్బన్ జిల్లాలోని చింతల్ వద్ద  ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలను  గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మూడు శవాలను గుర్తించారు. భార్యాభర్తలు తమ కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు,ఈబఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

loader