Asianet News TeluguAsianet News Telugu

రవితేజ ఎంట్రీతో నెక్ట్స్ లెవల్‌.. `వాల్తేర్‌ వీరయ్య` ఈవెంట్‌లో మాస్‌రాజాని ఆటపట్టించిన చిరు.. బాబీపై ప్రశంసలు

`వాల్తేర్‌ వీరయ్య` చిత్రంలో మాస్‌ మహారాజా రవితేజ పాత్రపై ఓపెన్‌ అయ్యారు చిరంజీవి. ఆయన పాత్ర ఎంట్రీతో సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుందన్నారు.

waltair veerayya movie next level after raviteja entry chiranjeevi revealed
Author
First Published Jan 8, 2023, 11:50 PM IST

`వాల్తేర్‌ వీరయ్య` చిత్రంలో మాస్‌ మహారాజా రవితేజ పాత్రపై ఓపెన్‌ అయ్యారు చిరంజీవి. ఆయన పాత్ర ఎంట్రీతో సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుందన్నారు. ఆ పాత్రకి ఆయన తప్పు ఎవరూ న్యాయం చేయలేరన్నారు. రవి ఎంట్రీతో సినిమా స్థాయి మారిపోతుందన్నారు. ఈ పాత్ర చేసేందుకు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే దీనికి పక్కనే ఉన్న రవితేజ అయ్యో అన్నయ్య అంటూ రియాక్ట్ కావడంతో సినిమాలోని `వీరయ్య` భాషలో డైలాగులు చెబుతూ కాసేపు ఆటపట్టించారు. `వాల్తేర్‌ వీరయ్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. 

ఇక తమ జర్నీ ముంబయిలో స్టార్ట్ అయ్యిందన్నారు. అప్పుడు `గుండారాజ్‌`లో స్నేహితుడిగా, ఆ తర్వాత తమ్ముడిగా నటించాడని, ఇప్పుడు తనతోపాటు కలిసి మెయిన్‌ రోల్‌ చేశాడని తెలిపారు చిరు. అతను ఎప్పట్నుంచో తన అభిమాని అని చెబుతున్నాడని, అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబీపై ప్రశంసలు కురిపించారు చిరు. అతనికి అభిమాని అని సినిమా ఇవ్వలేదని, చెప్పిన కథ నచ్చి చేశానని తెలిపారు. అతను పడే కష్టం, శ్రమ నిజమైన అభిమానాన్ని తెలియజేస్తుందని, అయితే సినిమాకి పనిచేసిన తీరు చూశాక బాబీ వర్క్ కి నేను పెద్ద అభిమానిని అయ్యానని చెప్పారు చిరంజీవి. ఏ దర్శకుడైనా ఇలా వర్క్ చేస్తే కచ్చితంగా సినిమాలు హిట్‌ అవుతాయన్నారు. 

ఇంకా చెబుతూ, ఇది రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమానే అని, కానీ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందన్నారు. సినిమాలో అన్ని అంశాలుంటాయని, ఫైట్లు, పాటలు, గ్లామర్‌, కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ ఇలా అన్నీ మేళవింపుతో ఉంటుందని, ప్రతి పది సినిమాలకు ఓ హై ఉంటుందన్నారు. రవితేజ తన పాత్ర ఎదురుపడితే నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుందని, ఇద్దరం ఢీ కొట్టే సీన్లు అదిరిపోతాయని చెప్పబోయాడు చిరంజీవి. కథ లీక్‌ చేస్తున్నారని దర్శకుడు చెప్పడంతో అంతటితో ఆపేశారు. ఇలా పలు మార్లు కథని చెప్పే ప్రయత్నం చేశారు. చిరు లీక్స్ ని దర్శకుడు, రవితేజ కంట్రోల్‌ చేశారు.

అయితే తాను చేసి సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలన్నీ ఇలానే ఉంటాయన్నారు. దీంతో బాబీ మీద అభిమానం పెరిగిపోయిందని, బాబీలో నలుగురు నిష్ణాతులు కనిపించారు.. ఒకరు కథకుడు, రెండవ వాడు రచయిత, మూడు స్క్రీన్ ప్లే రైటర్, ఆ తర్వాత డైరెక్టర్.. అతని టాలెంట్ అత్యద్భుతం అని సినిమా ఇచ్చానని తెలిపారు. దానికి న్యాయం చేశాడని, తాను అనుకున్నదానికంటే ఎక్కువ చేశాడని తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంపై ప్రశంసలు కురిపించారు. ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్టు, టెక్నీషియన్లని అభినందించారు. సరదాగా మాట్లాడుతూ చిల్ అయ్యేలా చేశారు. చిరవగా సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుందన్నారు. డోంట్ స్టాప్‌ సీయింగ్‌ పూనకాలు లోడింగ్‌ అంటూ ముగించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios