Asianet News TeluguAsianet News Telugu

ఆజన్మాంతం గుర్తుండిపోయే సంక్రాంతి ఇది.. డైరెక్టర్ బాబీ ఎమోషనల్ నోట్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా హిట్ టాక్ ను అందుకుంది. దీంతో దర్శకుడు బాబీ ఎమోషనల్ అవుతూ తాజాగా సుధీర్ఘమైన నోట్ పంచుకున్నారు. 

Waltair Veerayya Movie Director Bobby Emotional note!
Author
First Published Jan 15, 2023, 9:49 PM IST

మెగాస్టార్ చిరంజీవి -  దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). చిరు వింటేజ్ లుక్ లో అలరించడం, మాస్ మహారాజా కీలక పాత్రలో నటించడంతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందింది. మాస్ హీరోలను తగ్గట్టుగానే దర్శకుడు బాబీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం, మెగా మాస్ బ్లాక్ బాస్టర్ అందుకోవడంతో బాబీ తాజాగా స్పందించారు. ఈ  సందర్భంగా ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. 

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన బాబీ, ఈ ఏడాది సంక్రాంతిని ఎప్పటికి మరిచిపోయేలేనిదని అన్నారు. ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానం, తన అభిమాన హీరోలతో సినిమాను తెరకెక్కించడం, అదీ సంక్రాంతికి రిలీజ్ కావడం ఆజన్మాంతం గుర్తిండిపోతుందన్నారు. తన రెండేండ్ల కష్టానికి ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమా విజయవంతం అవడానికి భాగమైన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, తదితరులకు స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. 

యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించారు. చిరు, రవితేజ మాస్ లుక్స్, యాక్షన్ సన్నివేశాలకు, పాటలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. చిరు వింటేజ్ లుక్ లో దర్శనమివ్వడం, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలోని  కామెడీని ‘వాల్తేరు వీరయ్య’లో పండించడం అభిమానులకు బాగా నచ్చిందని తెలుస్తోంది. మొత్తానికి థియేటర్లలో విడుదలైన తొలిరోజు నుంచే సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios