బాబి తదుపరి చిత్రం ఏ హీరోతో చేస్తున్నారు..ఏ బ్యానర్ లో చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై మీడియాలో చిన్న లీక్ వచ్చింది.
తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం ఉన్నటువంటి దర్శకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ డైరెక్టర్ బాబి. చిరంజీవితో చేసిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అవటంతో ప్రస్తుతం ఈయన పేరు అంతటా మార్మోగిపోతోంది. పవర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో వరసపెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. ఈ నేపధ్యంలో బాబి తదుపరి చిత్రం ఏ హీరోతో చేస్తున్నారు..ఏ బ్యానర్ లో చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై మీడియాలో చిన్న లీక్ వచ్చింది.
అందుతున్న సమాచారం మేరకు ...సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు డైరక్టర్ బాబి ఓ కథ చెప్పటం నచ్చటం జరిగిపోయాయట. వాల్తేరు వీరయ్య స్పెషల్ షో వేయించుకుని చూసిన రజనీ ..బాబికి కాల్ చేసి కథ చెప్పమనటం జరిగిందని చెప్తున్నారు. ఈ క్రమంలో రజనీకు...ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో బాబి చెప్పిన కథ తెగ నచ్చిందని తెలుగు,తమిళ భాషల్లో భారీగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారని తెలుస్తోంది.
దిల్ రాజు రీసెంట్ గా విజయ్ తో వంశీపైడిపల్లి దర్శకత్వంలో వారసుడు చిత్రం చేసారు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నారు. ఇప్పుడు రజనీకాంత్ తో బాబి ప్రాజెక్టు సెట్ చేసాడంటున్నారు. ఈ వార్త నిజమే అయితే ఓ తెలుగు దర్శకుడుకు రజనీ ఛాన్స్ ఇవ్వటం గొప్ప విషయమే.
ఇక రజనీకాంత్, ‘దిల్’ రాజు, బాబి కాంబినేషన్‌లోని సినిమా నిజమేనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుతం ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నారు రజనీకాంత్. అలాగే ‘లాల్ సలామ్’లో ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాలు కాకుండా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ డైరెక్షన్‌లో రజనీ ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే.
