వాల్ స్ట్రీట్ జర్నల్ డైరెక్టర్ రాజమౌళి హీరోలు ఎన్.టి.ఆర్ చరణ్ లను వదిలిపెట్టి డాన్స్ కంపోజర్ ప్రేం రక్షిత్ ని ఇంటర్వ్యూ చేయడం షాకింగ్ గా మారింది.
80వ గోల్డెన్ గ్లోబ్ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు పాటకు అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. ఉత్తమ ఒరిజినల్ సాంగ్.. నాన్ ఇంగ్లీష్ కేటగిరీ నుంచి నాటు నాటు పాట ఎంపికవ్వగా.. ఏంఏం కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రాజమౌళి,రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి పాల్గొన్నారు. ఇందులో చరణ్, స్టైలీష్ లుక్ లో కనిపించారు. అయితే ఎస్.ఎస్.రాజమౌళితో పాటు గోల్డెన్ గ్లోబ్‌కి వెళ్లిన రామ్‌చరణ్ అక్కడ వెరైటీ మార్క్ మాల్కిన్‌తో మాట్లాడారు. అప్పటి నుంచి నాటు నాటు పాటకు అంతర్జాతీయంగా హవా మొదలైంది. సోషల్ మీడియా అంతా మారు మ్రోగిపోయింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రం గురించి హాలీవుడ్ మీడియాలో ఆర్టికల్స్ వచ్చాయి.
ఇప్పుడు తాజాగా యూఎస్ వార్త పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ లోనూ ఈ చిత్రం గురించిన ఆర్టికల్ వచ్చింది. నాటు నాటు సాంగ్ కంపోజ్ చేసిన ప్రేం రక్షిత్ మాస్టర్ ని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ గురించి ప్రస్తుతం అందరు చర్చించుకుంటున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ డైరెక్టర్ రాజమౌళి హీరోలు ఎన్.టి.ఆర్ చరణ్ లను వదిలిపెట్టి డాన్స్ కంపోజర్ ప్రేం రక్షిత్ ని ఇంటర్వ్యూ చేయడం షాకింగ్ గా మారింది.
ప్రేమ్ రక్షిత్ మాట్లాడుతూ.. ఈ సాంగ్ కొరియోగ్రఫీ టైం లో తాను ఎన్నో వందల కొద్దీ మూమెంట్స్ రెడీ చేసుకున్నానని కానీ రాజమౌళి ఆ స్టెప్ ఒక్కటి ఫైనల్ చేశారని చెప్పారు.
ఈ సాంగ్ తో ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సినిమాలో ఇద్దరు హీరోల బాడీ లాంగ్వేజ్ స్టైల్ ని బట్టి డ్యాన్స్ కంపోజ్ చేశానని అన్నారు ప్రేం రక్షిత్. అలా ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ తో ఆ కంపోజర్ గురించి కూడా ప్రపంచానికి తెలిసేలా చేసింది వాల్ స్ట్రీట్ జర్నల్.
ఇక క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది నాటు నాటు పాట. ఆస్కార్ తొలిమెట్టుకి చేరిన నాటు నాటు పాట సక్సెస్‌తో ఆస్కార్ నామినేషన్స్‌పై ట్రిపుల్ ఆర్ యూనిట్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. RRR టీమ్‌కి కంగ్రాట్స్ చెప్తూ ప్రముఖుల ట్వీట్లు చేశారు. సోషల్ మీడియాలో కురుస్తోన్న ప్రశంసల జల్లులో చిత్ర బృందం తడిసి ముద్దవుతోంది.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్‌కు నామినేట్ కావడంపై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు. ‘నా సినిమాలో నా పెద్దన్న (కీరవాణి) పాటకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ నామినేషన్ వచ్చింది..ఇంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు నేను తారక్, చరణ్ లను మించిపోయేలా వీరలెవల్లో నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తున్నాను. చంద్రబోస్ గారూ..అభినందనలు..ఆస్కార్ వేదిక మీద మన పాట..ధన్యవాదాలు.. ప్రేమ్ మాస్టర్ గారూ, పాటకు మీ సహకారం అమూల్యమైనది.. నా వ్యక్తిగత ఆస్కార్ మీకే.. ఇక ఈ పాట విషయంలో చాలాకాలంగా సందిగ్ధంలో ఉన్న నాకు భైరవ బీజీఎం ఎంతో భరోసా అందించింది.
ఈ పాటను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చన్న నమ్మకం కలిగించింది. థాంక్యూ అండ్ లవ్యూ భైరి బాబు. రాహుల్, భైరవల సూపర్ ఎనర్జిటిక్ వోకల్స్ పాటను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఇక ఈ పాట ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణాలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య సమన్వయం, స్టైల్. తమదైన శైలిలో వారు చేసిన డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకింది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ వేళ నేను పెట్టిన హింసకు వారిద్దరినీ క్షమాపణ కోరుతున్నా. ఛాన్స్ దొరికితే వాళ్లిద్దరినీ మరోసారి ఆడుకోవడానికి నేను వెనుకాడనండోయ్! అన్నారు.
