టాలీవుడ్ లో ఎన్టీఆర్, వినాయక్ ల కాంబినేషన్ కున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ఆది సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వినాయక్, ఎన్టీఆర్ లు అదుర్స్ తో హిట్ కొట్టారు. ఎన్టీఆర్ మరియు వివి వినాయక్ లది క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన అదుర్స్, ఆది చిత్రాలు సూపర్ హిట్ లుగా నిలవగా, సాంబ చిత్రం యావరేజ్ గా ఆడింది. ఇక అటు ఎన్టీఆర్ కు, ఇటు వివి వినాయక్ కు తరచుగా ఎదురయ్యే ప్రశ్న అదుర్స్ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడని. అన్ని కుదిరితే చేస్తామంటూ ఇద్దరూ చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా వివి వినాయక్ కు ఈ ప్రశ్న ఎదురైంది.

 

వివి వినాయక్, ఎన్టీఆర్ ల సూపర్ హిట్ జర్నీ ఆది చిత్రంతో మొదలైంది. ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది ఈ చిత్రం నుంచే. డాన్సులు, ఫైట్స్ అన్నింటికీ మించి డైలాన్గ్స్ విషయంలో ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. వివి వినాయక్, ఎన్టీఆర్ కాంబినేషన్ సాంబ చిత్రంతో మళ్ళీ రిపీట్ అయింది. ఆదిస్థాయిలో మ్యాజిక్ వర్కౌట్ కాకుండా ఈ చిత్రం పరవాలేదనిపించింది. విద్య ప్రాముఖ్యతని తెలియజేసేలా ఈ చిత్రాన్ని వినాయక్ చిత్రీకరించారు. ఆది చిత్రం ఎంతటి విజయం సాధించిందో అంతకు మించేలా అదుర్స్ ప్రభంజనం కొనసాగింది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో అదరగొట్టేశాడు.

 

ఎన్టీఆర్, వినాయక్ ఎక్కడ కనిపించినా అభిమానుల నుంచి మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్న ఇదే. అదుర్స్ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటెలిజెంట్ చిత్ర ప్రమోషన్లో భాగంగా వినాయక్ కు ఈ ప్రశ్న ఎదురైంది. ఎప్పుడు చేస్తానో తెలియదు కానీ తప్పకుండా అదుర్స్ చిత్రానికి సీక్వెల్ చేస్తానని హామీ ఇచ్చాడు.