చిరు ఇమేజ్ కు సరిపడ స్క్రిప్ట్ లేకే ఆ డైరక్టర్ కు నో చెప్తున్నారా?
ఈ జనరేషన్ యూత్ ఆలచోనలకు తగినట్లు, తన ఇమేజ్ ని మర్చిపోకుండా ఉండేలా చూసుకుంటూ సినిమా చేద్దామని చెప్పారట. నో చెప్పలేదు కానీ యస్ కూడా చెప్పలేదంటున్నారు.

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల విజయం తర్వాత చిరంజీవి చేసిన భోళా శంకర్ ఘోరమైన డిజాస్టర్ అయ్యింది.. దీంతో చిరంజీవి ఇప్పుడు పూర్తి ఆలోచనలో పడిపోతున్నారు. తన ఇమేజ్ కు తగ్గ సబ్జెక్టులు, తన అభిమానులను అలరించే మేటర్ ఉన్నవే ఎంచుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో యంగ్ డైరక్టర్స్ ని,సీనియర్ డైరక్టర్స్ ని పిలిపించి కథలు వింటున్నారు. ముఖ్యంగా వివి వినాయక్ తో సినిమా చెయ్యాలని చిరంజీవికు ఎప్పటి నుంచో ఉంది. అయితే అందుకు తగ్గ కథ సెట్ కావటం లేదు.
చిరంజీవి కు వినాయిక్ పై ఎంత నమ్మకం అంటే... రీఎంట్రీ ఖైదీ నెం.150 ఆయనే దర్శకుడు అనే సంగతి తెలిసిందే. చిరుకు మంచి బ్లాక్ బాస్టర్ హిట్‌ను అందించారాయన. గతంలో ఆది, ఠాగూర్, అదుర్స్ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లను అందుకున్న ఆయన.. రీసెంట్గా బాలీవుడ్ అరంగేట్రం చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్‌తో ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ఛత్రపతి హిందీ రీమేక్ చేశారు. కానీ అది భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో వినాయక్‌కు తన స్టామినా ఏంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆయన అంతగా ఫామ్‌లో లేరు. పెద్ద హీరోలు ఎవరూ ప్రస్తుతం ఆయనతో చేయట్లేదు. ఇలాంటి పరిస్థితిలో చిరు నిజంగానే వినాయక్‌కు అవకాశం ఇస్తే.. ఎలాంటి కథలో వస్తారనేది ఆసక్తికరంగా మారింది.
అయితే గతంలో వినాయక్ దర్శకత్వంలో చిరు హీరోగా వచ్చిన రెండు సినిమాలు కూడా తమిళ రీమేక్ సినిమాలే. అయితే ఈ సారి వినాయక్ సొంత కథతో రాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ కథ నిమిత్తం చిరంజీవి ని ఈ మధ్యన చాలా సార్లు కలిసినట్లు సమాచారం. కానీ చిరంజీవిని మెప్పించలేకపోయారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దాంతో ఈ కాలంకు తగినట్లు, తన ఇమేజ్ ని మర్చిపోకుండా ఉండేలా చూసుకుంటూ సినిమా చేద్దామని చెప్పారట. నో చెప్పలేదు కానీ యస్ కూడా చెప్పలేదంటున్నారు. ఈకాంబో నిజంగా వర్కవుట్ అయితే ఈ సినిమాపై ముందునుంచే అంచనాలు నెలకొనడం ఖాయం. మరి చిరు-వినాయక్ హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి. ఈ కాంబో కోసం మెగా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే తన కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణంలో బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణతో చిరంజీవి ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కథ విషయంలో కూడా చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారని చెప్తున్నారు.ఇక బింబిసార దర్శకుడు విశిష్టతో చిరు చేయటానికి రంగం సిద్దమైంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సోషియో ఫ్యాంటసీ మూవీగా ఇది రాబోతుంది . అయితే ఈ సోషియో పాంటసీ గ్రాఫిక్స్ తో ఉంటుందని, దానికి ఆరు నెలలు దాకా టైమ్ పట్టవచ్చు అని ఈ లోగా ఓ సినిమా పూర్తి చేయవచ్చు అని చిరంజీవి భావిస్తున్నారట.