Asianet News TeluguAsianet News Telugu

VT12 : వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రెడీ.. రిలీజ్ కు డేట్ ఫిక్స్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం తన 12వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇందుకు డేట్ కూడా ఫిక్స్ చేసి తాజాగా అప్డేట్ ఇచ్చారు.
 

VT12 movie Title and first look poster will release on this date nsk
Author
First Published Jan 17, 2023, 12:48 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ప్రతి సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ చివరిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో విడుదలైన స్పోర్ట్స్ డ్రామా ‘గని’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘ఎఫ్3’తో హిట్ అందుకున్నారు. ఇక తన అప్ కమింగ్ ఫిల్మ్స్ పైనా వరుణ్ తేజ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్స్ తో 12వ మరియు 13వ చిత్రాలను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుణ్ VT12పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ అందింది.

‘గోస్ట్’ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో VT12 తెరకెక్కబోతోంది. వరుణ్ తేజ్ ను నెక్ట్స్ లెవల్లో ప్రజెంట్ చేయబోతున్నారంట. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ అందించారు. చిత్రం టైటిల్ ను, అదేవిధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను జనవరి 19న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా అదిరిపోయే పోస్టర్ ను వదిలారు. ఇందులో వరుణ్ తేజ్ చేతిలో పవర్ ఫుల్ వెపన్ ను పట్టుకొని స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. దీంతో ఫస్ట్ లుక్ పై ఆసక్తిని పెంచుతోంది.

వరుణ్ తేజ్ 12వ సినిమా వివరాల్లోకి వెళితే.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రత్యేకమైన కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా తెరకెక్కుతోంది.  మిక్కీ జె మేయర్ స్వరాలు సమకూర్చుతున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కి హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.  ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న  VT13పైనే అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈప్రాజెక్ట్ ను డెబ్యూ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేయనున్నాడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్ లో రూపుదిద్దుకోనుంది. ఇందులో దేశం కోసం పోరాడే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios