Asianet News TeluguAsianet News Telugu

`బిగ్‌ బాస్‌ తెలుగు 7` విన్నర్‌పై వీజే సన్నీ ప్రిడిక్షన్‌.. టాప్ 5 కంటెస్టెంట్లు వీరే

బిగ్‌ బాస్‌ తెలుగు 7 షో రసవత్తరంగా సాగుతుంది. ఇందులో బిగ్‌ బాస్‌ విన్నర్ ఎవరు? టాప్‌ 5 కంటెస్టెంట్‌ ఎవరనేది తాజాగా బిగ్‌ బాస్‌ 5వ సీజన్‌ విన్నర్‌ వీజే సన్నీ జోస్యం చెప్పారు. 

vj sunny predictions on bigg boss 7 winners and top 5 contestants arj
Author
First Published Nov 22, 2023, 5:47 PM IST

బిగ్‌ బాస్‌ ఐదో సీజన్‌లో విన్నర్‌గా నిలిచారు వీజే సన్నీ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సన్నీ, రాను రాను పుంజుకున్నాడు. ఆ తర్వాత షోలో రచ్చ రచ్చ చేశాడు. షణ్ముఖ్‌ బ్యాచ్‌కి ఇచ్చిపడేసి టాప్‌ కంటెస్టెంట్‌గా నిలిచాడు. చివర్లో ఊహించని విధంగా విన్నర్‌ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్‌ షో క్రేజ్‌ తగ్గించింది. గత సీజన్‌ చాలా డల్‌గా సాగింది. ఈ సారి మళ్లీ ఊపొచ్చింది. ఆ ఊపు కొన్నిసార్లు మాత్రమే ఉంటుంది. చాలా వరకు సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారు. దీంతో ఆ రచ్చ ఉండటం లేదు. 

ఈ నేపథ్యంలో తాజాగా బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్‌పై బిగ్‌ బాస్‌ 5వ విన్నర్‌ వీజే సన్నీ స్పందించారు. విన్నర్‌, టాప్‌ 5 కంటెస్టెంట్ల గురించి ఆయన ఓపెన్‌ అయ్యారు. తన అంచనా మేరకు టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే ఉండొచ్చని చెప్పారు. అందులో భాగంగా శివాజీ, పల్లవి ప్రశాంత్‌, అమర్‌ దీప్‌, యావర్‌, ప్రియాంక ఉంటారని వెల్లడించారు. ఇక బిగ్‌ బాస్‌ విన్నర్‌ గురించి ఆయన స్పందిస్తూ, విన్నర్‌ ఎవరనేది తాను ఇప్పుడు చెప్పలేనని వెల్లడించారు. 

ఒకరి పేరు చెబితే మరొకరి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారని, దాడులకు దిగుతున్నారని, శివాజీ పేరు చెబితే ప్రశాంత్‌ ఫ్యాన్స్, ప్రశాంత్‌ పేరు చెబితే శివాజీ ఫ్యాన్స్ కొట్టేలా ఉన్నారు(నవ్వుతూ) అని అందుకే తాను దీనిపై స్పందించలేను అని చెప్పారు. అయితే తాను నటించిన `సౌండ్‌ పార్టీ` మూవీ ఎల్లుండి(నవంబర్‌ 24న) అవుతున్న నేపథ్యంలో రిలీజ్‌ తర్వాత దీనిపై స్పందిస్తా అని, అప్పుడు ఓపెన్‌గా చెబుతా అని తెలిపారు సన్నీ. 

ఇక తాను నటిస్తున్న `సౌండ్‌ పార్టీ` మూవీ కామెడీగా ఉంటుందని, థియేటర్‌కి వచ్చిన ఆడియెన్స్ డిజప్పాయింట్‌ కారని తెలిపారు. కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారని, అందుకు హామీ ఇస్తున్నట్టు తెలిపారు. పూర్తి హిలేరియస్‌గా మూవీ ఉంటుందన్నారు సన్నీ. ఇకపై సినిమాల విషయంలో కేర్‌ తీసుకుంటున్నానని, మంచి కథలనే సెలక్ట్ చేసుకుంటున్నాని, ఒకదాని తర్వాత మరోటి చేస్తానని తెలిపారు సన్నీ. 
 

Follow Us:
Download App:
  • android
  • ios