Asianet News TeluguAsianet News Telugu

VJ Sunny: బిగ్ బాస్ పై అనుమానాలు, అసలు సీక్రేట్ చెప్పిన మాజీ విన్నర్ సన్నీ

బిగ్ బాస్ హౌస్ లో జరిగేదంతా నిజమేనా..? హౌస్ లో టాస్క్ లు.. గొడవలు, మాటలు.. అన్నీ నేచురల్ గా జరిగేవేనా.. లేక స్క్రిప్ట్ డా.. మేకర్స్ రాసిన స్క్రిప్ట్ ను వాళ్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారా..? ఇలా ఎన్నో అనుమానాలకు తాజాగా క్లారిటీ ఇచ్చాడు మాజీ విన్నర్ విజె సన్నీ. ఇంతకీ అతను ఏమంటున్నాడంటే...? 
 

VJ Sunny Clarity about Bigg Boss House Secrets JMS
Author
First Published Nov 12, 2023, 10:22 AM IST


బిగ్ బాస్ హౌస్‌ అంటేనే ఎమోషన్స్.. అది ఏడుపు కాని.. నవ్వు కాని.. స్నేహం కాని.. ప్రేమ కాని.. ఫ్రెండ్షిప్ కాని.. ఇలా ఏ ఏమోషన్ అయినా సరే..  బిగ్ బాస్ హౌస్ లో చూస్తుంటాం..అది కూడా మోతాదుకు మించి చూస్తుంటా..అందులోభాంగంగా...  అరుచుకోవడం.. కొట్టుకోవడం.. ఏడ్వడం.. లవ్, రొమాన్స్ ఇలా చాలా ఎమోషన్స్ చూస్తూ ఉంటాం. అయితే అదంతా నిజమేనా?  ఎంత నిజమైనా..మరీ అంతలా హౌస్ ను మెయింటేన్ చేయడం సాధ్యం అవుతుందా..? ఇలా రకరకాల ప్రశ్నలు బిగ్ బాస్ పై ఇప్పటికీ ఉన్నాయి. 

అయితే ఈ ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు మాజీబిగ్ బాస్ విన్నర్ విజే సన్ని. ఈ అంశాలపై తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ ఆసక్తికరమైన విషయాలు  పంచుకున్నారు. షేర్ చేశారు.బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదన్నారు వీజే సన్నీ. డబ్బుల కోసం ఎవరూ క్యారెక్టర్ పోగొట్టుకోరని చెప్పారు. బిగ్ బాస్‌కి వచ్చే ప్రతి కంటెస్టెంట్ గుర్తింపు ఉన్నవారని ఎవరు విలువ పోగొట్టుకోరని అన్నారు. బిగ్ బాస్‌లో కనిపించేది అక్షరాల నిజమని ఆయన స్పష్టం చేశారు. బిగ్ బాస్‌లో ఇలా చేయండి.. అలా చేయండి అని ఎవరూ ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వరని ఎవరి ఆట వారు ఆడతారని అన్నారు.

బిగ్ బాస్‌కి వచ్చే వారిని ఎవరు రికమండ్ చేయన్నారు వీజే సన్నీ. ఎవరైనా రావాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ల పేర్లు సజెస్ట్ చేయమని అడుగుతారని.. తను కూడా కొందరి పేర్లు సజెస్ట్ చేశానని అందులో కొందరు మాత్రమే హౌస్‌కి వెళ్లారని సన్నీ చెప్పారు. గెలుపుకోసం కంటెస్టెంట్లు పీఆర్‌లను పెట్టుకున్నా లోపల ఆడే కంటెస్టెంట్లలో ఎవరు జెన్యూన్ అని జనాలు నమ్ముతారో వాళ్లే టాప్‌లోకి వెళ్తారని స్పష్టం చేశారు. మొదటి సీజన్ షోకి వచ్చిన వారికి కాస్త టఫ్‌గా ఉండి ఉండొచ్చని తర్వాత సీజన్‌కి వచ్చిన కంటెస్టెంట్లు మాత్రం కాస్త అవగాహనతో వచ్చి ఆడుతున్నారని చెప్పారు. ఈ సీజన్‌లో శివాజీ చాలా స్మార్ట్‌గా ఆడుతున్నారని అన్నారు వీజే సన్నీ.

ఇక వీజే.స‌న్నీ (VJ Sunny) హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా న‌టిస్తున్న నూతన చిత్రం, ‘సౌండ్ పార్టీ’ (Sound Party). ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లుగా రూపుదిద్దుకుంటోంది. జయ శంకర్ సమర్పిస్తున్నారు. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, చలాకి చంటి, తేజ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. మోహిత్ రెహమానిక్ సంగీతం అందిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios