The Vaccine War Trailer : ‘కోవ్యాక్సిన్’ తెర వెనుక కథ.. సైంటిస్టుల కృషి.. ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్ చూశారా?
కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రీ ‘ది కశ్మీర్ ఫైల్’తో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ సెక్సెస్ తర్వాత కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో ‘ది వ్యాక్సిన్ వార్‘ (The Vaccine War) చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు కూడా సిద్ధమైంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
‘ది వ్యాక్సిన్ వార్’ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో వ్యాక్సిన్, కోవాక్సిన్ అభివృద్ధిపై ట్రూ స్టోరీని చెప్పే ప్రయత్నం చేశారు. మెడికల్ డ్రామాగా తెరకెక్కుతున్నఈ చిత్రం 'భారతదేశంలోనే మొట్టమొదటి బయో-సైన్స్ చిత్రం కావడం విశేషం. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఎలాంటి సంచనాలను సృష్టిస్తుందోనని ఎదురుచూస్తున్నారు.
ఇక తాజాగా హిందీ వెర్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు. కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు భారతీయ వైజ్ఞానిక సంఘం చేసిన త్యాగాలు, వారి స్ట్రగుల్స్, విజయాలను ట్రైలర్ లో వివరించారు. వ్యాక్సిన్‌ల అభివృద్ధి వెనుక ఇండియన్ మెడికల్ సైంటిస్ట్ ల కృషిని తెలియజేశారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనలను ఆసక్తికరంగా చూపించారు. ట్రైలర్ చిత్రంపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
ఇక ఈ చిత్రానికి వివేక్ అగ్ని హోత్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అనుపమ్ ఖేర్, నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి ప్రధాన పాత్రలు పోషించారు. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. పల్లవి జోషి నిర్మాతగా వ్యవహరించారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం హిందీతో పాటు పలు భాషల్లోనూ విడుదల కానుంది.