బాహుబలిని మించిన వివేగం కలెక్షన్లు..

vivegam shocks Bahubali movie
Highlights

  • అజిత్-కాజల్ జంటగా ఇటీవల విడుదలైన చిత్రం వివేగం
  • తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోని వివేగం
  • తమిళనాడులో రికార్డులను బద్దలు కొడుతోంది.

బాహుబలి - ఈ చిత్రం విడుదల అయిన ప్రతీ చోటా వసూళ్ళ వర్షం కురిపించింది. ఇండియన్ సినిమా హిస్టరీ లోనే విజువల్ గా, టెక్నికల్ గా , కలక్షన్స్ పరంగా ఒక ట్రెండ్ ని , బెంచ్ మార్క్ ని సెట్ చేసేసింది ఈ చిత్రం.

 

ఈ సినిమాని అధిగమించడం కోసం కనీసం ఆ స్థాయిని చేరుకోవడం కోసం ఇండియా వ్యాప్తంగా ఉన్న సూపర్ హీరోలు తమ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు అనేది చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విషయం లో సక్సెస్ అయ్యింది వివేకం టీం. అజిత్ హీరోగా వచ్చిన వివేగం సినిమా తెలుగులో ప్లాప్ గా నిలిచింది.

 

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అజిత్ హీరోగా వచ్చిన ఈ సినిమాకి తెలుగులో వివేకం అనే పేరు పెట్టారు. ఓపెనింగ్ లు పరవాలేదు అనిపించినా రొటీన్ స్టోరీ పేలవమైన క్లైమాక్స్ తో ఈ చిత్రం సరిగ్గా రన్ అవ్వలేదు. కానీ ఇదంతా తెలుగు లో సంగతి , తమిళం లో మాత్రం దాదాపు మూడు వేల థియేటర్ లలో విడుదల అయిన ఈ చిత్రం తొలి రోజునే 33 కోట్ల 8 లక్షల రూపాయలను రాబట్టింది.

 

చెన్నైలో రెండవ వారంలోనే 8 కోట్లను వసూలు చేసి 'బాహుబలి' రికార్డును అధిగమించింది. అజిత్ క్రేజ్ కు అద్దం పడుతూ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక విడుదలైన సినిమాలు 100 కోట్లను రాబట్టడం కష్ట సాధ్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోను ఈ సినిమా 100కోట్ల క్లబ్ లో చేరిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

loader