Asianet News TeluguAsianet News Telugu

విశ్వక్ సేన్ ’గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ స్పెషల్ పోస్టర్.. మాస్ కా దాస్ హంగామా..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ చిత్రం నుంచి పండుగ సందర్భంగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదలైంది. చిత్రం నుంచి విశ్వక్ నయా లుక్ ఆకట్టుకుంటోంది. 
 

Vishwak Sens  Gangs Of Godavari movie Special Poster NSK
Author
First Published Oct 24, 2023, 4:37 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. విభిన్న పాత్రలూ పోషిస్తున్నారు. సినిమా సినిమాకు కొత్తదనం చూపిస్తూ తన క్రేజ్ మరింతగా పెంచుకుంటున్నారు. నటుడిగా, నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. చివరిగా ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో అలరించారు. తన ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. 

ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ Gangs of Godavari చిత్రంలో నటిస్తున్నారు. లంకల రత్న అనే పాత్రలో అలరించబోతున్నారు. మునుపెన్నడూ చూడని రోల్, బాడీ లాంగ్వేజీతో ఆకట్టుకోనున్నారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. డీజేటిల్లు ఫేమ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty)  కథానాయిక. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. 

ఇప్పటికే చిత్రం నుంచి అందిన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక దసరా పండుగ సందర్భంగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేశారు. రాజకీయ ప్రచారంలో జీప్ పై ఊరేగింపుగా వస్తున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెల్ల చోక్కా, పట్టుపంచెలో నాయకుడిగా ఆకట్టుకుంటున్నారు. పోస్టర్లతోనే విశ్వక్ పాత్రపై యూనిట్ మరింతగా క్యూరియాసిటీ పెంచేస్తోంది. 

ఈచిత్రం పీరియాడిక్ పొలిటికల్ టచ్ తో ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది. 1980… ఆ ప్రాంతంలో గోదావ‌రి నేప‌థ్యంలో జ‌రిగే క‌థ ఇది అని టాక్. హీరోయిన్ అంజలి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే కమెడియన్ హైపర్ ఆది కూడా మరోపాత్రలో అలరించనున్నారు. చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Vishwak Sens  Gangs Of Godavari movie Special Poster NSK

Follow Us:
Download App:
  • android
  • ios