యంగ్ హీరో విశ్వక్ సేన్ వైవిద్యమైన చిత్రాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆయన లేటెస్ట్ మూవీ హిట్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ పాత్రలో విశ్వక్ నటనకు ప్రశంశలు దక్కాయి. స్టార్ హీరో నాని నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. ఇక ఈ యంగ్ హీరో ఫేవరేట్ టాలీవుడ్ స్టార్ ఎవరంటే టక్కున ఎన్టీఆర్ పేరు చెప్తూంటాడు.  అందుకే ఎన్టీఆర్ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఓ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నాడీ హీరో.

'ఫలక్ నుమా దాస్ ర్యాప్ సాంగ్'  పేరుతో ఈ సాంగ్ రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ అభిమానులంతా ఈ పాటతో ఖుషీ అవుతారని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ విషయమై సోషల్ మీడియాలో ఎన్టీఆర్ డిస్కషన్స్ పెడుతున్నారు. విశ్వక్ మాట్లాడుతూ.. ”తెలుగులో నేను ఎక్కువగా అభిమానించే హీరో ఎన్టీఆర్. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఆయన. ఏ సీన్ అయినా సింగిల్ టేక్ లో చేయడం ఆయన ప్రత్యేకత. ” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

ఇక జూనియర్ ఎన్టీఆర్.. పుట్టిన రోజు వేడుకలకు మరో ఒక రోజే ఉంది. మే 20న ఆయన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. అయితే ప్ర‌తి ఏడాది ఘ‌నంగా జ‌రిగే ఈ బ‌ర్త్‌డే వేడుకలు కూడా ఈ సారి ర‌ద్దు అవుతున్నాయి. మాములుగా అయితే తమ అభిమాన హీమో పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కు పెద్ద పండగే .. కటౌట్లు , భారీ ఫ్లెక్సీలు , కేకులు అంతా భారీ ఎత్తున జరుపుకుంటారు. ఇక పెద్ద హీరోల పండగకు చెప్పాల్సిన అవసరంలేదు. కానీ క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఎన్టీఆర్  స్వ‌యంగా రంగంలోకి దిగి త‌మ బ‌ర్త్ డే వేడుక‌ల‌ని జ‌ర‌పొద్దంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ ను తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని కోరారు. మరో ప్రక్క ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న ఎన్టీఆర్ ని కొమరం భీమ్ గా చూసి ఎంజాయ్ చేద్దాం ఆకాశమంత ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే ఎదురైంది.  

' ప్రతి ఏటా నా పుట్టిన రోజున మీరు చూపించే ప్రేమ చేసే సేవ కార్యక్రమాలు ఓ ఆశీర్వచనంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం  మీరు ఇంటిపట్టునే ఉంటూ అధికారుల సూచనలు పాటిస్తూ  భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం 'అంటూ  లేఖను విడుదల చేసారు. కాగా ఎన్టీఆర్ పుట్టిన రోజును సోషల్ మీడియాలో ట్రెండ్ చేయటానికి అభిమానులు సిద్ధమౌతున్నారు.