Asianet News TeluguAsianet News Telugu

ప్రైమ్‌లో విశ్వక్‌ సేన్‌ `పాగల్‌`.. ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్‌ అప్పుడే!

ఇప్పుడు నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలో రాబోతుంది. ఈ నెల 3న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 240దేశాల్లో ఇది స్ట్రీమింగ్‌ కానుందని అమెజాన్‌ ప్రైమ్‌ తెలిపింది. 
 

vishwak sen starrer paagal streaming in sept 3rd ott
Author
Hyderabad, First Published Sep 1, 2021, 2:31 PM IST

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన చిత్రం `పాగల్‌`.  నివేతా పేతురాజ్‌ కథానాయికగా నటించిన ఈచిత్రానికి నరేష్‌ దర్శకత్వం వహించారు. దిల్‌రాజ్‌, బెక్కం వేణుగోపాల్‌ నిర్మించారు. ఆగస్ట్ 14న థియేటర్లో విడుదలై బాగా రన్‌ అయ్యింది. ఇప్పుడు నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలో రాబోతుంది. ఈ నెల 3న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 240దేశాల్లో ఇది స్ట్రీమింగ్‌ కానుందని అమెజాన్‌ ప్రైమ్‌ తెలిపింది. 

ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ ప్రకటించారు. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా దీన్ని రూపొందించినట్టు నిర్మాతలు తెలిపారు. `డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాతలు సంతోషంగా ఉన్నప్పుడే ఓ సినిమా సూపర్‌ హిట్‌ అయినట్లుగా భావిస్తా, `పాగల్‌`కి వసూళ్లు బాగా వచ్చాయి. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించడం సంతోషంగా ఉంది. 

కరోనా ఫస్ట్‌వేవ్‌ తర్వాత థియేటర్స్‌లో సినిమాను చూడటానికి ప్రేక్షకులు బాగా వచ్చారు. ఆ సమయంలో వచ్చి, హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సినిమాలకు మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ తర్వాత ఆడియన్స్‌ ఆశించిన స్థాయిలో థియేటర్స్‌కు రావడం లేదు. థర్డ్‌ వేవ్‌ వస్తుందని వినిపిస్తున్న వార్తలు కూడా ఓ కారణం కావొచ్చు. మిడిల్‌ క్లాస్‌ ఆడియన్స్‌ థియేటర్స్‌కు వచ్చినప్పుడే పెద్ద స్థాయి కలెక్షన్స్‌ చూడొచ్చు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌వల్ల మార్కెట్‌ పెరిగింది. నిజానికి అందరూ థియేటర్స్‌కు రారు. అలా రానివారు ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు. ఆ వ్యూయర్స్‌ అంతా ఎక్స్‌ట్రా ఆడియన్సే` అని నిర్మాత తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios