ఈ నగరానికి ఏమైంది సినిమాతో వెండితెరకు పరిచయమైన కథానాయకుడు విశ్వక్ సేన్ క్రేజీ ప్రాజెక్టులతో ముందుకు వెళుతున్నాడు. ఇటీవల ఫలక్ నుమా దాస్ సినిమాతో ఓ వర్గం ఆడియెన్స్ ని ఎట్రాక్ చేసిన విశ్వక్ నెక్ట్ కూడా అలాంటి డిఫరెంట్ కథలతోనే సినిమాలు చేయాలనీ అడుగులు వేస్తున్నాడు. త్వరలో నాని వాల్డ్ పోస్టర్ లో ఒక సినిమాను స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. 

ఇక ఇప్పుడు ఒక బాలీవుడ్ రీమేక్ లో ఈ యువ హీరో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  గత ఏడాది బాలీవుడ్ లో రిలీజైన సోను కె టిటు కి స్వీటీ సినిమా బాక్స్ సినిమా రీమేక్ రైట్స్ ను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వచ్చాయి. 

హీరోలు కూడా ఫైనల్ అయినట్లు టాక్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఆ కథలో కథానాయకుడిగా విశ్వక్ సేన్ అయితే బెటర్ అని సురేష్ బాబు ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.