రీసెంట్ గా ఫలక్ నుమా దాస్ సినిమాతో యూత్ ని ఎట్రాక్ట్ చేసిన యువ హీరో విశ్వక్ సేన్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా అనేది ఓ వర్గం ఆడియెన్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. మొదట ఈ హీరో తరుణ్ భాస్కర్ ఈ ఈనగరానికి ఏమైంది అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 

నటుడిగానే కాకుండా ఫలక్ నుమా దాస్ సినిమాతో దర్శకుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ కొత్త దర్శకుడితో నిర్మిస్తున్న సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. నరేష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న  ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ మిడ్ లో స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని సమాచారం. 

వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి సినిమాను ఇదే ఏడాది ఎండింగ్ లో రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. ఇక ఈ సినిమాతో పాటు విశ్వక్ సేన్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ లో కూడా మరో సినిమాను చేయనున్నాడు. మరో రెండు ప్రాజెక్ట్ లు కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.