మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'ధమ్కీ'. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనేది విశ్వక్ సేన్ ప్లాన్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'ధమ్కీ'. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనేది విశ్వక్ సేన్ ప్లాన్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి హాట్ బ్యూటీ నివేత పేతురాజ్ విశ్వక్ సేన్ సరసన ఈ చిత్రంలో నటిస్తోంది. 

ధమ్కీ చిత్రం మార్చి 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు. తాజాగా ధమ్కీ ట్రైలర్ విడుదలయింది. ఫన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో సాగే కన్ఫ్యూషన్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ మెడికల్ సైంటిస్ట్ గా.. బిందాస్ గా ఎంజాయ్ చేస్తూ గాలికి తిరిగే కుర్రాడిగా డ్యూయెల్ రోల్ లో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. గాలికి తిరిగే కుర్రాడు సైంటిస్ట్ అవతారం ఎత్తాల్సి వస్తుంది. అప్పుడు మొదలయ్యే కన్ఫ్యూషన్ మంచి ఫన్ జనరేట్ చేస్తోంది. అసలు ఈ రెండు పాత్రల మధ్య సంబంధం ఏంటి అనే ఉత్కంఠ ట్రయిల్ లో కనిపిస్తోంది. 

ఎప్పటిలాగే విశ్వక్ సేన్ తన మాస్ యాటిట్యూడ్ తో అదరగొడుతున్నాడు. ఇక నివేతా పేతురాజ్ మునుపెన్నడూ లేని విధంగా గ్లామర్ ఒలకబోస్తూ విశ్వక్ సేన్ తో మంచి కెమిస్ట్రీ పండించింది. మీరు పెద్ద బ్యాట్స్ మెన్ అనుకున్నానే.. కానీ ఇప్పుడు ఫిచ్ మొత్తం ఖాళీగా ఉందే అంటూ నివేత చెప్పే డబుల్ మీనింగ్ డైలాగులు.. విశ్వక్ సేన్ ట్రైలర్ చివర్లో చెప్పే బూతు డైలాగ్ పై సోషల్ మీడియాలో చర్చ జరగడం ఖాయం. ఈ చిత్రం విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడు.