ఇప్పటి వరకు అభిమానులు, వెల్ విషర్స్ ఎంతగానో ఆదరించారు, సపోర్ట్ చేశారని, అందరిని సపోర్ట్ తో జీవితంలో మరో ముందడుగు వేస్తున్నట్టు చెప్పారు విశ్వక్ సేన్.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తూ వార్తల్లో హాట్ టాపిక్ అవుతుంటారు. ఆయన చుట్టూ వివాదాలు ఎప్పుడూ ఉంటాయనే కామెంట్ ఉంది. ఇటీవల `బేబీ` సినిమా విషయంలోనూ ఆయన వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సైలెంట్‌గా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఫ్యాన్స్ కి అదిరిపోయే వార్త చెప్పాడు. తాను ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు విశ్వక్ సేన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు.
ఇప్పటి వరకు అభిమానులు, వెల్ విషర్స్ ఎంతగానో ఆదరించారు, సపోర్ట్ చేశారని, అందరిని సపోర్ట్ తో జీవితంలో మరో ముందడుగు వేస్తున్నట్టు చెప్పారు విశ్వక్ సేన్. ఈ విషయాన్ని చెప్పడానికి తాను ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు. తన జీవితానికి సంబంధించిన ఓ మంచి విషయాన్ని మీతో పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తాను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని తెలిపారు. పక్కన అమ్మాయి అబ్బాయి ఫోటోని యాడ్ చేశాడు విశ్వక్.
ఇక తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని స్వయంగా వెల్లడించడం విశేషం. అయితే పూర్తి వివరాలు మాత్రం త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. ఇందులో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అమ్మాయి ఎవరనేది మాత్రం చెప్పలేదు. అసలు విషయాన్ని సస్పెన్స్ లో పెట్టి త్వరలో డిటెయిల్స్ వెల్లడిస్తానని చెప్పడం విశేషం. దీంతో ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు. అమ్మాయి ఎవరనేది వెతికే పనిలో పడ్డారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. విశ్వక్ సేన్‌కి పెళ్లి కళ వచ్చిందంటున్నారు. అదే సమయంలో అమ్మాయి ఎవరని అడుగుతున్నారు.
ఇదిలా ఉంటే విశ్వక్ సేన్.. హీరోయిన్ నివేతా పేతురాజ్‌తో ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా వినిపించాయి. ఈ ఇద్దరు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు కూడా చేశారు. `పాగల్`, ఇటీవల `ధమ్కీ` సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. ఇప్పుడు నివేతా కొత్త సినిమాలు చేయడం లేదు. ఇప్పుడు విశ్వక్ సేన్ తాను ఓ ఇంటి వాడిని కాబోతున్నట్టు, పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించడంతో విశ్వక్ చేసుకోబోయేది ఆమెనేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఆమెనా? లేక పెద్దలు చూసిన అమ్మాయా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా విశ్వక్ సేన్ పెళ్లి కబురుతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇండస్ట్రీలో మరో పెళ్లి సందడి వినిపించబోతున్నాయని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.
