టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి-విశ్వక్ సేన్ వివాదం అంతకంతకు తీవ్రరూపం దాల్చుతుంది. విశ్వక్ సేన్ విషయంలో టీవీ ఛానల్ తో పాటు దేవి ప్రవర్తించిన తీరును ఎండగడుతున్నారు. పాత వీడియోలు బయటకు తీసి ఏకిపారేస్తున్నారు. నెటిజెన్స్ తో పాటు చిత్ర ప్రముఖుల నుండి విశ్వక్ కి మద్దతు లభిస్తుంది.  

తాజాగా ఈ వివాదంలో దర్శకుడు హరీష్ శంకర్ (Director Harish Shankar)తలదూర్చారు. ఆయన యాంకర్ దేవి నాగవల్లిపై వరుస సెటైర్స్ పేల్చుతున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా యాంకర్ అనసూయ బుక్ అవుతుంది. అనసూయకు సంబంధం లేకున్నా... ఆమె గత కామెంట్స్ ఆమెను విమర్శలపాలు చేస్తున్నాయి. అనసూయ (Anasuya)కామెంట్స్ కారణంగా టీవీ9 యాంకర్ దేవి ఇరుక్కున్నారు. టీవీ9 ఛానల్ తో పాటు దేవికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పలు మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. సదరు మీమ్స్, సెటైర్స్ హరీష్ శంకర్ తన ఫేస్ బుక్ లో షేర్ చేశారు. అలాగే సదరు మీమ్స్ కి స్పందనగా నవ్వుతున్న ఎమోజీలు పోస్ట్ చేశారు. 

ప్రశ్న అనే ఓ ఫేస్ బుక్ పేజ్.. గతంలో అనసూయ రిపోర్టర్ దేవి(Devi Nagavalli) ఎదురుగా కూర్చొని ఫ** అనే బూతు పదం వాడారు. అర్జున్ రెడ్డి మూవీ యూనిట్ విమర్శించే క్రమంలో అనసూయ నోటి నుండి ఆ పదం వచ్చింది. ఆ వీడియోని ఉద్దేశిస్తూ... ‘అరెరే.. భలే దొరికిందే ఈ వీడియో.. దేవి snake వల్లి అక్క కి ఈ పదం ఇప్పుడు బ్రహ్మానందం కామెడీ సీన్‌లా అనిపించి, అక్కలోని హాస్య గ్రంధులు విచ్చుకునట్టు ఉన్నాయ. అందుకే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుంది.. మళ్ళి అక్కకి ఇక్కడ ఫైటర్ అనసూయ కనిపించింది. అంతేనా అక్కా ??... అంటూ కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ హరీష్ శంకర్ తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశారు. 

అలాగే టీవీ 9 రజినీకాంత్‌.. విశ్వక్ సేన్‌ని బుడ్డ హీరో అంటూ వ్యాఖ్యలు చేయడాన్ని ట్రోల్ చేస్తున్న వీడియోని సైతం పోస్ట్ చేసి సెటైర్లు వేశారు. ‘ఇక్కడ గాయపడింది ఫిమేల్ యాంకర్ కాదు.. యావత్ మహిళా సమాజం.. మనసుకి గాయం అయ్యింది దేవి నాగవల్లికి కాదు.. ధైర్యంగా జీవించాలనుకుంటున్న మహిళా సమాజానికి.. విశ్వక్ వాడిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉంది’ అంటూ భారీ డైలాగ్‌లను టీవీ 9 వాడేయడంతో ఆ డైలాగ్‌లకు ట్రోల్స్ జతచేసిన వీడియోను షేర్ చేశారు హరీష్ శంకర్. ఈ రెండే కాదు.. దేవి నాగవల్లిని.. టీవీ 9పై వస్తున్న ట్రోల్స్‌ని వరుసగా విడుదల చేస్తున్నారు హరీష్ శంకర్.

ఈ వివాదంలో విశ్వక్ (Viswhak Sen)కి మద్దతుగా, దేవికి వ్యతిరేకంగా వస్తున్న ట్రోల్స్ ని ఆయన షేర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి విశ్వక్ పట్ల దేవి ప్రవర్తించిన తీరు హరీష్ ని హర్ట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అదే సమయంలో సినిమా వాడిగా ఆయన తన సపోర్ట్ పూర్తిగా విశ్వక్ సేన్ కి ప్రకటించారు. మరోవైపు విశ్వక్ ప్రాంక్ వీడియో చేసిన కారణంగా అతనిపై ఒకరు హ్యూమన్ రైట్స్ కమీషన్ లో పిర్యాదు చేశారు. అలాగే స్టూడియోలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ దేవి... సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని యాదవ్ ని కలిసి, ఫిర్యాదు చేశారు. 

చిత్ర ప్రముఖులతో పాటు సోషల్ మీడియా జనాలు ఈ ఘటనలో విశ్వక్ కి మద్దతుగా నిలుస్తున్నారు. దేవి అతని విషయంలో పొగరుగా ప్రవర్తించారంటున్నారు. విశ్వక్ స్థానములో ఓ పెద్ద హీరో ఉంటే ఆమె వ్యక్తిగత ఆరోపణలు చేస్తారా? స్టూడియో నుండి వెళ్ళిపో.. గెట్ అవుట్ వంటి పదాలు వాడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా కొందరు అప్ కమింగ్ హీరోలతో ఈమె ఇదే తరహాలో ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.