శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో గోపిచంద్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. గోపిచంద్‍కు ఇది 32వ సినిమాగా ఉంది.
సినిమా పరిశ్రమలో లెక్కలు వేరుగా ఉంటాయి. పైకి కనపడే టైటిల్ వేరు..లోపల కనపడే సినిమా వేరు అన్నట్లు నడుస్తూంటాయి.అలాగే బయిట నుంచి చూసేవాళ్లకు గోపీచంద్ తో సినిమా చేసి నష్టపోయారు అనిపిస్తుంది. కానీ మళ్లీ అదే హీరోతో అదే ప్రొడక్షన్ హౌస్ సినిమా కోసం కొలాబరేట్ అవుతూంటే మాత్రం ఆశ్చర్యపోవటం మనవంతు అవుతుంది. అలాంటిదే ఇప్పుడు గోపీచంద్ సినిమాకు జరగబోతోందని తెలుస్తోంది.
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1 గా హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మాస్, ఫ్యామిలీస్‌ని సమానంగా మెప్పిస్తూ యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్ల… గోపీచంద్ ను ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో చూపిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో లావిష్‌గా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ విదేశాల్లో జరుగింది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై అత్యుత్తమ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు People Media Factory వారు ఈ సినిమాతో కలుస్తున్నట్లు సమాచారం. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో గోపిచంద్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. గోపిచంద్‍కు ఇది 32వ సినిమాగా ఉంది.
పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ తో రీసెంట్ గా వేణు దోనేపూడి తో చర్చలు జరిగాయని, నాలుగు సినిమాలు కలిపి చేయటానికి ఇద్దరి మధ్యా ఒప్పందం కుదిరిందంటున్నారు. పీపుల్స్ మీడియా అంటే ఖచ్చితంగా బాగా ఖర్చుపెడతారు. రిలీజ్ ఏ సమస్యా లేకుండా స్మూత్ గా జరుగుతుంది. మాగ్జిమం ఫైనాన్సియల్ సమస్యలు ఉండవు. ఇవన్ని దృష్టిలో పెట్టుకునే గోపీచంద్ ఈ మీటింగ్ ఎరేంజ్ చేసారంటున్నారు. త్వరలోనే ఫైనల్ షెడ్యూల్ ఈ సినిమాకు జరగనుంది. గోపీచంద్ తో పీపుల్స్ మీడియావారు గతంలో రామబాణం అనే సినిమా తీసారు. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లక్ష్యం, లౌక్యం’ సూపర్ హిట్ అయ్యాయి. ఆ చిత్రాల తరహాలోనే ఫ్యామిలీ, యాక్షన్, బ్రదర్ సెంటి మెంట్ నేపథ్యంలో ‘రామబాణం’ ఉంటుందనుకుంటే డిజాస్టర్ అయ్యింది.
విశ్వప్రసాద్ మాట్లాడుతూ... కాన్సెప్ట్ నచ్చితే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు నిర్మిస్తున్నాం. అయితే సినిమా విజయం అనేది మన చేతుల్లో ఉండదు.. కానీ వంద శాతం మన ప్రయత్నం చేయాలి. మేం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుండటంతో విజయాల శాతం ఎక్కువగానే ఉంది. మా అబ్బాయి వ్యాపారం చూసుకుంటున్నాడు. మా అమ్మాయికి సినిమాపై ఆసక్తి ఉంది. శర్వానంద్‌తో చేస్తున్న సినిమా విషయంలో తన ప్రమేయం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, అల్లు అర్జున్.. ఇలా అందరి హీరోలతో సినిమాలు నిర్మించాలనుంది.. ఆ ప్రయత్నాలు చేస్తున్నాం అని గతంలోనే చెప్పుకొచ్చారు.
