ఇండియా పేరుని భారత్ గా మార్చబోతున్నట్లు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ 20 సదస్సు సందర్భంగా కేంద్రం ఈ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేయబోతున్నట్లు చర్చ జరుగుతోంది.
ఇండియా పేరుని భారత్ గా మార్చబోతున్నట్లు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ 20 సదస్సు సందర్భంగా కేంద్రం ఈ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేయబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయాన్ని సమర్ధించేవాళ్ళు వ్యతిరేకించవాళ్ళు ఉన్నారు. దీనితో సోషల్ మీడియాలో ఇండియా, భారత్ పేర్లు ట్రెండింగ్ గా మారాయి.
సినీ రాజకీయ క్రీడా రంగ ప్రముఖులు కూడా ఈ నిర్ణయంపై వారికి తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇండియా పేరుని భారత్ గా మార్చాలని వరుస ట్వీట్స్ చేస్తున్నారు. అంతే కాదు ఇండియన్ క్రికెట్ టీమ్ పేరు కూడా టీం భారత్ అని మార్చాలని బీసీసీఐ ని కోరాడు. ఆటగాళ్ల జెర్సీలపై కూడా భారత్ అనే ముద్రించాలని సెహ్వాగ్ సూచిస్తున్నాడు.
ఇండియా అనేది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన పేరు కాబట్టి దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సెహ్వాగ్ ట్వీట్ పై యువ హీరో విష్ణు విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెహ్వాగ్ ప్రతిపాదనపై మండిపడుతూ విష్ణు విశాల్ ప్రశ్నించాడు.
సర్ అంటే ఇప్పటి వరకు మీకు ఇండియా అనే పేరు గర్వంగా అనిపించలేదా ? అని ప్రశ్నించాడు. అంతే కాదు ఇప్పటికిప్పుడు ఇండియా పేరు మార్చడం వల్ల దేశానికీ ఉపయోగం ఏంటి అని డీప్ గా ఆలోచిస్తున్నట్లు విశాల్ తెలిపాడు. దీనివలన ఇండియా ఎకానమీ ఏమైనా మారుతుందా అని సెటైర్ వేశాడు. ఇండియా అంటే భారత్.. భారత్ అంటే ఇండియా అని అందరికి తెలుసు. కానీ ఎందుకు ఇండియా అనే పదాన్ని మాయం చేయాలని చూస్తున్నారు అంటూ విష్ణు విశాల్ ప్రశ్నించాడు.
