మీడియా మారిపోయింది. గాసిప్స్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది.   ఆన్ లైన్ మీడియా, సోషల్ మీడియాలో రూమర్స్ రాజ్యం ఏలుతున్నాయి. ముఖ్యంగా సిని సెలబ్రెటీలకు క్రేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారి వివాహాలు, ఎఫైర్స్ చుట్టూ రూమర్స్ తిరుగుతూంటాయి. అయితే చాలా మంది సెలబ్రెటీలు ఈ వార్తలను లైట్ తీసుకుంటారు. మరికొందరు మాత్రం తన కెరీర్ కు డ్యామేజ్ ఏర్పడుతుందనుకుంటే వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూంటారు. తాజాగా తమిళ హీరో విష్ణు విశాల్‌ కూడా ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్న తమ పెళ్లి  వార్తపై స్పందించారు

"రాక్ష‌స‌న్" అనే ఒక త‌మిళ సినిమా ఇటీవ‌ల విడుద‌లై సూపర్ హిట్టైంది.   తెలుగులోనూ రీమేక్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో విష్ణు విశాల్ హీరో. అత‌ని స‌ర‌స‌న అమ‌లాపాల్ న‌టించింది. వీరిద్దరూ డైవర్స్ తీసుకున్నారు. దాంతో  సినిమాలోనే కాదు ఆఫ్‌స్క్రీన్‌లోనూ వీరి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింద‌ని, పెళ్లికి ముహూర్తం చూసుకుంటున్నార‌ని ఒక తమిళ వెబ్‌సైట్ క‌థనాన్ని ప్ర‌చురించింది. 

ఆ వార్త‌కి స్పందిస్తూ ..విష్ణు విశాల్ ట్వీట్ చేశాడు ‘ఆమెతో నాకు పెళ్లా.. ఇది స్టుపిడ్‌ వార్త. బాధ్యతగా వ్యవహరించండి. మనం మనుషులం. మనకూ కుటుంబాలు ఉంటాయి. ఏదో ఒక వార్త కావాలని కదా అని ఇష్టం వచ్చినట్లు ఏదిపడితే అది రాసేయకండి’ అని ట్విటర్‌ ద్వారా మండిపడ్డారు. 

ఇక కొన్ని నెలల క్రితమే విశాల్‌ తన భార్య రజనీతో విడిపోయానని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. మరోపక్క అమలా పాల్‌ ఏడాది క్రితం ప్రముఖ దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్ని నెలల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు.ప్రస్తుతం ఆమె సినిమాలతో బిజీగా ఉన్నారు.