వైఎస్ఆర్-చంద్రబాబు అనుబంధంపై ఓ బయోపిక్ ప్రకటించారు నిర్మాత విష్ణు ఇందూరి. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే దర్శకుడు దేవకట్టా ఫైర్ అవ్వటం హాట్ టాపిక్ గా మారింది. అది తన కాన్సెప్ట్ అని, 2017లోనే, “గాడ్ ఫాదర్” స్పూర్తితో 3 భాగాల కథ రాసుకున్నానని ఆరోపించాడు. అంతేకాదు.. రీసెంట్ గా దాన్ని వెబ్ సిరీస్ ఫార్మాట్ లోకి కూడా మార్చి, రిజిస్టర్ కూడా చేయించి, ఓటీటీలతో సంప్రదింపులు జరుపుతున్న వేళ.. ఇలా విష్ణు ఇందూరి సడెన్ గా ఆ సిరీస్ ను ప్రకటించేశాడని ఆరోపిస్తున్నాడు దేవకట్టా. 2017లో తను రాసి, రిజిస్టర్‌ చేయించిన ఓ కథ ఐడియాను విష్ణు కాపీ కొట్టారని దేవ కట్టా ఆరోపించారు. 

సాయిధరమ్‌తేజ్‌ సినిమా చేస్తూ కూడా చంద్రబాబు, వైఎస్సార్‌ కథపై వర్క్‌ చేస్తున్నా. ఎప్పుడో మూడు వెర్షన్లుగా రాసుకొన్న ఆ కథను వెబ్‌ సిరీస్‌లా చేయాలనుకున్నా. ఇంతలో గతంలో నేను చెప్పిన ఐడియాతో సినిమాగా తీస్తున్నట్లు ఇటీవల విష్ణు ప్రకటించారు. నాకు మాట మాత్రమైనా చెప్పకుండా అలా చేయడంతో కోపం వచ్చింది.

 చంద్రబాబు, వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిల కథ నా బ్రెయిన్‌ చైల్డ్‌. ఫిక్షనల్‌గా ఆరు యాంగిల్స్‌లో ఆ కథ రాశా. అతను ఏ యాంగిల్‌లో ఆ కథను టచ్‌ చేసినా నా కథకు పోలికలు రాక మానదు. అందుకే వెనక్కి తగ్గదల్చుకోలేదు. న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అయితే నిజంగా ఆ ప్రాజెక్ట్‌ను ప్రెస్టీజియస్‌గా తీయాలనుకుంటే మాత్రం అందులో నేనూ భాగస్వామిని అవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఒక గొప్ప కథ చిల్లర ప్రాజెక్ట్‌ కావడం మాత్రం నాకు ఇష్టం లేదు. విష్ణు ఇందూరిలాగా అబద్ధాలు చెప్పడం కూడా నాకు రాదు’’ అని వివరించారు.  

విష్ణు ఇందూరి రిప్లై ఇస్తూ దేవకొట్టా చేసిన ఆరోపణలు కొట్టిపారేసారు...ఓ రీమేక్ కాన్సెప్ట్ తో దేవకట్టాను కలిశానని, అదే టైమ్ లో ఎన్టీఆర్ బయోపిక్ ఆలోచనను బేసిక్ స్క్రీన్ ప్లేతో అతడికి నెరేట్ చేశానని చెప్పుకొచ్చాడు. అంతేతప్ప, ఆ బయోపిక్ కోసం దేవకట్టా తనకు ఎలాంటి రాత సహకారం అందించలేదని ఆరోపించాడు. అయితే ఈ ప్రాజెక్టు గురించి ఆయన స్పందించలేదు.