గొప్ప మనసు చాటుకున్న విశాల్.. షూటింగ్ కి వెళ్లి ఆ గ్రామంలో కోసం ఏంచేశాడంటే

హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. టైం ట్రావెల్ నేపథ్యంలో ఎంటర్టైనింగ్ మూవీ గా   విజయం దక్కించుకుంది.

vishal solves water problem in a village dtr

హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. టైం ట్రావెల్ నేపథ్యంలో ఎంటర్టైనింగ్ మూవీ గా   విజయం దక్కించుకుంది. రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా, యస్ జె సూర్య విలన్ గా అదరగొట్టారు. 

రీసెంట్ గా ఈ చిత్రం ఓటీటీలోకి కూడా వచ్చింది. విశాల్ తెలుగు తమిళ భాషల్లో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో. విశాల్ ని తెలుగు ప్రేక్షకులు ఇక్కడి నటుడిగానే ప్రేమ కురిపిస్తారు. మార్క్ ఆంటోని చిత్రం మంచి విజయం సాధించింది. విశాల్ నటుడు మాత్రమే కాదు.. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి కూడా. 

విశాల్ సినిమాల్లో నటిస్తూనే పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. తాజాగా విశాల్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఒక ఒక గ్రామం దాహార్తిని తీర్చాడు. విశాల్ ప్రస్తుతం హరి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈతూత్తుకుడి జిల్లాలో జరుగుతోంది. వీరకాంచీపురం, ఊశిమేసియాపురం, కుమారచక్కణపురం గ్రామాల్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. 

కుమారచక్కణపురం గ్రామంలో నీటి సమస్య ఉందని విశాల్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన విశాల్ తన సొంత ఖర్చులతో బోరు బావి వేయించారు. అంతే కాదు 5 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న సింథటిక్ వాటర్ ట్యాంక్ ని కూడా ఏర్పాటు చేశారు. గ్రామస్థులు నీటిని ఉపయోగించుకునేలా కుళాయిలు కూడా ఏర్పాటు చేశాడు. 

ఏళ్ల తరబడి ఉన్న నీటి సమస్యని తీర్చిన విశాల్ కి తాము రుణపడి ఉంటాం అని గ్రామస్థులు అంటున్నారు. విశాల్ చేసిన ఈ గొప్ప పనికి సంబంధించిన ఫోటోలు సొసైల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios