'కాలా'పై విశాల్ కామెంట్!

vishal on rajinikanth kaala ban in karnataka
Highlights

కావేరి నది జలాల విషయంలో ప్రముఖ నటుడు రజినీకాంత్ తమిళులకు మద్దతుగా 

కావేరి నది జలాల విషయంలో ప్రముఖ నటుడు రజినీకాంత్ తమిళులకు మద్దతుగా మాట్లాడడం కన్నడిగులకు కోపం తెప్పించింది. దీంతో ఆయన నటిస్తోన్న 'కాలా' సినిమాను కర్ణాటకలో విడుదల కానివ్వమంటూ హెచ్చరికలు జారీ చేశారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గోవింద్ 'కాలా'ను కర్ణాటకలో నిషేదిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై స్పందించిన రజినీకాంత్.. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి తన సినిమా విడుదలయ్యేలా చూడాలని కోరారు.

అసలు కర్ణాటకలో తన సినిమాను ఎందుకు అడ్డుకుంటున్నారో సరైన కారణాలు తనకు అర్ధం కావడం లేదని అన్నారు. ఇప్పుడు నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు అయిన విశాల్..  తలైవాను సపోర్ట్ చేస్తూ ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయాలని అంటున్నారు.

''కావేరి జలాల విషయంలో రజినీకాంత్ సర్ మాట్లాడడం అనేది అతడి బాధ్యత. దాని కారణంగా 'కాలా' సినిమా రిలీజ్ ను కర్ణాటకలో ఎలా అడ్డుకోగలరు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ వారు ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను'' అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

 

loader