Asianet News TeluguAsianet News Telugu

విశాల్ కు ఇలాంటి సమస్య రావటం ఏమిటి..ఇండస్ట్రీ షాక్

సాధారణంగా విశాల్ నటించిన సినిమా విడుదల అవుతుందంటే.. థియేటర్లు అసలు సమస్యే రాదు. కానీ.. ఎనిమి విషయంలో మాత్రం అందుకు భిన్నమైన అనుభవాన్ని నిర్మాతలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. 

Vishal movie Enemy lacking of Theaters?
Author
Chennai, First Published Oct 24, 2021, 3:44 PM IST

కోలీవుడ్ స్టార్ హీరోలు విశాల్ - ఆర్య కలిసి నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ఎనిమీ''. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు  ‘ఎనిమి’ రిలీజ్ కు  ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురవుతున్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది.

సాధారణంగా విశాల్ నటించిన సినిమా విడుదల అవుతుందంటే.. థియేటర్లు అసలు సమస్యే రాదు. కానీ.. ఎనిమి విషయంలో మాత్రం అందుకు భిన్నమైన అనుభవాన్ని నిర్మాతలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను దీపావళికి ఒక రోజు ముందుగా నవంబరు 4న రిలీజ్ చేద్దామని చిత్ర దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. అదే రోజున సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘‘అన్నాత్త’’ మూవీని రిలీజ్ చేస్తున్నారు. 

సూపర్ స్టార్ మూవీ విడుదల అంటే.. అదెంత భారీ ఎత్తున రిలీజ్  ఉంటుందో తెలిసిందే. దీంతో.. విశాల్ మూవీకి థియేటర్లు దొరకని పరిస్థితి గా చెప్తున్నారు. దీంతో.. ఈ మూవీ టీం టెన్షన్ కు గురవుతున్నట్లుగా చెబుతున్నారు. రజనీ మూవీ విడుదల అవుతున్న వేళ.. విడుదల అవుతున్న విశాల్ మూవీకి కనీసం 250థియేటర్లను కేటాయించాలంటూ ఈ చిత్ర నిర్మాత మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో ఒకటి బయటకు వచ్చి  వైరల్ గా మారింది. దాంతో విశాల్ సినిమా కోసం థియేటర్లు దొరకపోవటమేంటి అంటూ చర్చ మొదలైంది. 

ఇక  భారీ యాక్షన్ సీక్వెన్సులు - ఛేజింగ్ సన్నివేశాలతో నిండిన ఈ యాక్షన్ ప్యాకెడ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ ఆర్డి రాజశేఖర్ అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో విలక్షణ నటుడు మమతా మోహన్ దాస్ - కరుణాకరన్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.

శత్రువులుగా మారిన ఇద్దరు ప్రాణ స్నేహితుల కథే 'ఎనిమీ' సినిమా అని తెలుస్తోంది. స్నేహితులైన విశాల్ - ఆర్య శత్రువులుగా ఎలా మారారు? దీని వెనకున్న అసలు కథేమిటి? అనేది తెలియాలంటే 'ఎనిమీ' సినిమా విడుదలయ్య వరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ సాంగ్స్ కంపోజ్ చేయగా.. శ్యామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. రేమాండ్ డేర్రిక్ క్రాస్తా ఎడిటింగ్ వర్క్ చేయగా.. రవి వర్మ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.

మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వాడు - వీడు' సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత విశాల్ - ఆర్య స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరి 'పెద్దన్న' చిత్రంతో ఉన్న పోటీ తట్టుకుని ఈ  స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్  ''ఎనిమీ'' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios